కొంతమంది పోలీసు అధికారులు( Police officers ) తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంటారు, వారు ట్రక్కు, ఆటో డ్రైవర్లను బాగా హింసిస్తుంటారు.అమాయకుల పట్ల ప్రతాపం చూపిస్తూ రెచ్చిపోతుంటారు.
వీరి అన్యాయమైన చర్యలు ఏదో ఒక విధంగా బయటపడుతూనే ఉంటాయి.పై అధికారులు వీరుపై క్రమశిక్షణ తీసుకుంటారు.
అయితే ఒక ఘటనలో మాత్రం ఆ అవసరం లేకుండా పోయింది.ట్రక్ డ్రైవర్ భయపడకుండా ఒక పోలీస్ కి బుద్ధి చెప్పాడు.
ఆ పోలీసు కానిస్టేబుల్, ట్రక్ డ్రైవర్లకు ( police constables , truck drivers )మధ్య జరిగిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో, ఒక పోలీసు కానిస్టేబుల్ రోడ్డుకు రాంగ్ సైడ్ ( Wrong side )తన కారు నడపడం చూడవచ్చు.ఎదురుగా వస్తున్న ఒక ట్రక్ డ్రైవర్ దారి ఇవ్వడానికి నిరాకరించాడు.
దీనితో కోపం తెచ్చుకున్న కానిస్టేబుల్ తన కారు దిగి ఒక కర్రతో ట్రక్ డ్రైవర్ వైపు నడిచాడు.అతను అరవడం మొదలుపెట్టి అతన్ని భయపెట్టడానికి ప్రయత్నించాడు.అయినప్పటికీ, ట్రక్ డ్రైవర్ వెనక్కి తగ్గకుండా ధైర్యంగా నిలబడ్డాడు.
ట్రక్ డ్రైవర్ ధైర్యంగా స్పందిస్తూ, “నీ దగ్గర కర్ర ఉంటే, నా దగ్గర ఇనుప రాడ్ ఉంది, సార్.దమ్ముంటే ముందుకు రాండి.ఈరోజు నీకు నేనేంటో చూపిస్తా, పోలీస్ సాబ్” అని అన్నాడు.
అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఈ సంఘటనను వీడియో తీశాడు.ఎవరో వీడియో తీస్తున్నారని చూసి, కానిస్టేబుల్ వెనక్కి తగ్గాడు.
అతను తన కారు దగ్గరికి తిరిగి వెళ్లి, కోపంగా ఏదో గొణుక్కుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఈ వీడియోను safalbanoge అనే ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్ చేయగా, అది వైరల్ అయింది.దీన్ని లక్షల మంది చూడగా, వేల మంది లైక్ చేశారు.చాలా మంది నెటిజన్లు ట్రక్ డ్రైవర్ చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేనందున, అతని ధైర్యాన్ని మెచ్చుకున్నారు.
కొంతమంది యూజర్లు “ఈ డ్రైవర్ పుష్ప-2 చూసినట్లున్నాడు” అని కామెంట్ చేయగా, మరికొందరు “తమది కరెక్ట్ అని తెలిసిన వారి నమ్మకం ఇదే”, అని “కానిస్టేబుల్‌కు బుద్ధి చెప్పడం మంచిదయింది” అని అన్నారు.