విమానం ఇంజన్‌లోకి దూసుకెళ్లిన పక్షి.. చివరికి ఏమైందో చూడండి..

అమెరికన్ ఎయిర్‌లైన్స్( American Airlines ) విమానం ప్రమాదానికి గురైంది.ఈ విమానం న్యూయార్క్‌లోని( New York ) లాగార్డియా విమానాశ్రయం నుంచి నార్త్ కరోలినాలోని షార్లెట్ సిటీకి బయల్దేరింది.

 American Airlines Plane Flying Miracle On The Hudson Route Strikes Bird Video Vi-TeluguStop.com

ఫ్లైట్ 1722, ఎయిర్‌బస్ A321 అని కూడా పిలిచే ఈ విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ఒక ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంది.అది ఏంటంటే, దీని ఇంజన్‌లోకి ఒక పక్షి( Bird ) వెళ్లిపోయింది.

రైట్ సైడ్ ఇంజన్‌లోకి పక్షి దూసుకెళ్లడంతో అది పూర్తిగా పనిచేయకుండా పోయింది.దీంతో విమానం ఒక్కసారిగా కుదుపునకు లోనైంది.

ఒక ఇంజన్ ఆగిపోవడంతో విమానం శక్తిని కోల్పోయింది.ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.అయితే, విమాన సిబ్బంది అత్యంత చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని వెనక్కి మళ్లించారు.క్వీన్స్‌లోని జాన్ ఎఫ్.కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో(JFK) సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్( Emergency Landing ) చేశారు.పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ విమానం షార్లెట్ డగ్లస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాల్సి ఉంది.కానీ, అది లాంగ్ ఐలాండ్ తీరాన్ని దాటేలోపే వెనక్కి రావాల్సి వచ్చింది.పక్షి ఇంజన్‌ను బలంగా ఢీకొనడంతో అది తీవ్రంగా దెబ్బతింది.దాంతో విమానం ఒకే ఇంజన్‌తో ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది.న్యూయార్క్, న్యూజెర్సీ పోర్ట్ అథారిటీ తెలిపిన ప్రకారం, విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది, ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.ఆ విమానంలో 190 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.

అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి మాట్లాడుతూ, సిబ్బంది పరిస్థితిని చాలా సమర్థవంతంగా చక్కదిద్దారని చెప్పారు.కలిగిన అసౌకర్యానికి విమానయాన సంస్థ క్షమాపణలు చెప్పింది.ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని హామీ ఇచ్చింది.అందరికీ హోటల్ వసతి కల్పించారు, మరుసటి ఉదయానికి విమానాన్ని రీషెడ్యూల్ చేశారు.

సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో, పక్షి ఇంజన్‌ను ఢీకొట్టినప్పుడు మంటలు రావడం స్పష్టంగా కనిపిస్తుంది.కొందరు ప్రయాణికులు తమ భయానక అనుభవాలను పంచుకున్నారు.

ఎమీ స్టాంపర్ అనే ప్రయాణికురాలు మాట్లాడుతూ, “నేను చనిపోతానని అనుకున్నాను.చిన్న పేలుళ్లు, మంటలు వచ్చాయి” అని తెలిపింది.

మరొక ప్రయాణికుడు మంటలు చూసి ప్రాణాల కోసం ప్రార్థించినట్లు చెప్పాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube