2024 సంవత్సరంలో లెక్కకు మిక్కిలి సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి.ఈ సినిమాలలో సక్సెస్ సాధించిన సినిమాలను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు.
అయితే రిలీజైన సినిమాలలో మెజారిటీ సినిమాలు అంచనాలను మించి సక్సెస్ సాధించడంతో పాటు కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాయి.మహేష్ గుంటూరు కారం,( Guntur Kaaram ) బన్నీ పుష్ప2,( Pushpa 2 ) ప్రభాస్ కల్కి 2898 ఏడీ,( Kalki 2898 AD ) ఎన్టీఆర్ దేవర( Devara ) సినిమాలతో సత్తా చాటారు.
ఈ నాలుగు సినిమాలు కలెక్షన్ల విషయంలో సైతం సత్తా చాటాయి.గుంటూరు కారం మినహా మిగతా మూడు సినిమాలు పాన్ ఇండియా సినిమాలు అనే సంగతి తెలిసిందే.
అయితే 2024 సంవత్సరంలో రియల్ విన్నర్ ఎవరనే ప్రశ్నకు ఎక్కువమంది ప్రభాస్( Prabhas ) పేరును జవాబుగా చెబుతున్నారు.ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమాతో బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించారు.
పుష్ప ది రూల్ కూడా భారీ స్థాయిలోనే కలెక్షన్లను సాధిస్తున్నా కల్కి రికార్డును బ్రేక్ చేయడం మాత్రం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పుష్ప2 సినిమాకు యునానిమస్ హిట్ టాక్ అయితే రాలేదు.ఈ రెండు సినిమాల తర్వాత స్థానంలో దేవర ఉండగా దేవర సినిమాకు 550 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.గుంటూరు కారం సినిమా 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.
స్టార్ హీరోల సినిమాలు రిలీజైన ప్రతి సందర్భంలో థియేటర్లు మాత్రం కళకళలాడుతున్నాయనే చెప్పాలి.2025 సంవత్సరంలో ఎక్కువ సంఖ్యలో పాన్ ఇండియా సినిమాలు విడుదలవుతూ ఉండగా ఈ సినిమాలలో ఎన్ని సినిమాలు సక్సెస్ సాధిస్తాయో చూడాల్సి ఉంది.టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోల క్రేజ్ ఇతర భాషల్లో సైతం అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.