పెట్రోల్ కొట్టించుకొని డబ్బులు కట్టకుండా ఏం మాస్టర్ ప్లాన్ చేసావ్ గురూ.. (వీడియో)

ప్రస్తుత రోజులలో ఆన్లైన్ మోసాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ క్రమంలో వివిధ రకాలుగా దారుణాలకు పాల్పడడంతో పాటు అనేక విధాలుగా డబ్బులను కాజేస్తున్నారు కొంతమంది.

 Man Ran Away Pretending Scan Qr Code At Petrol Bunk Video Viral Details, Viral V-TeluguStop.com

అయితే, సోషల్ మీడియాలో నిత్యం ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.అచ్చం అలాగే ఒక వ్యక్తి పెట్రోల్( Petrol ) కొట్టించే క్రమంలో డబ్బులు పంపే క్రమంలో క్యూఆర్ కోడ్ ను( QR Code ) స్కాన్ చేసి డబ్బులు చెల్లించకుండా అక్కడి నుంచి పారిపోయిన సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

వైరల్ అవుతున్న వీడియో( Viral Video ) ఆధారంగా.సాధారణంగా పెట్రోల్ బంకులోకి ఒక వ్యక్తి తన కారులో( Car ) పెట్రోల్ కొట్టించడానికి వచ్చాడు.ఈ క్రమంలో సదరు పెట్రోల్ బంక్ సిబ్బంది కారు వెనక ట్యాంక్ క్యాప్ తీసి పెట్రోల్ కొట్టాడు.ఈ క్రమంలో కార్ డ్రైవింగ్ సీట్ లో ఉన్న వ్యక్తి కిందికి దిగి క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి మళ్లీ కారు వద్దకు వచ్చేసాడు.

ఈ క్రమంలో సిబ్బంది పెట్రోల్ పట్టి క్యాప్ బిగించిన అనంతరం ముందుకు వచ్చి డబ్బులు పడ్డాయో లేదో అని చెక్ చేస్తూ ఉండగా, ఇంతలోనే ఆ వ్యక్తి కార్ తో సహా అక్కడ నుంచి పారిపోయాడు.దీంతో ఒక్కసారిగా పెట్రోల్ బంకు సిబ్బంది మొత్తం అక్కడి నుంచి కారు వెనకాల పరుగులు పెట్టారు.

అయితే, ఆ సమయంలో అక్కడే వాహనంలో ఉన్న పోలీసులు కూడా ఆ కారును ఫాలో అయ్యారు.ఈ సంఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అవ్వడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.వీడియో చూసిన కొంతమంది నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.ఇతను కారు కూడా అలానే దొంగతనం చేశాడేమో అని కొంత మంది కామెంట్ చేస్తూ ఉంటే.మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube