ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Icon star Allu Arjun )తన సినీ కెరీర్ లో ఎన్నో భారీ హిట్లను సొంతం చేసుకున్నారు.పుష్ప ది రూల్ సినిమాకు సంబంధించి ఇప్పటికే చాలా ప్రాంతాలలో బుకింగ్స్ మొదలయ్యాయి.
ప్రేక్షకుల్లో పుష్ప ది రూల్ ఫీవర్ అంతకంతకూ పెరుగుతోంది. కిస్సిక్ సాంగ్ ( Kissik Song )ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించింది.
ఊ అంటావా సాంగ్ రేంజ్ లో లేకపోయినా ఈ సాంగ్ ప్రత్యేకతలు దీనికి ఉన్నాయి.
అయితే పుష్ప ది రూల్( pushpa the rule movie ) సినిమాలో ఒక భారీ షాట్ ను బన్నీ సింగిల్ టేక్ లో పూర్తి చేశారని తెలుస్తోంది.
రెండున్నర నిమిషాల భారీ షాట్ ను బన్నీ సులువుగా పూర్తి చేయడం గమనార్హం.ఆ సీన్ సినిమాకే హైలెట్ గా నిలిచేలా ఉంటుందని భోగట్టా.బన్నీ, రష్మిక ( Bunny, Rashmika )మధ్య వచ్చే సీన్స్ కూడా బాగుంటాయని ఆ సీన్స్ సినిమా రేంజ్ ను పెంచడం పక్కా అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

పుష్ప ది రూల్ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగిందని సమాచారం అందుతోంది.సినిమాలో జాతర ఎపిసోడ్ ఏకంగా 25 నిమిషాల పాటు ఉంటుందని తెలుస్తోంది.సెన్సార్ బోర్డ్ నుంచి ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ వచ్చిందని తెలుస్తోంది.
ఈ సినిమాలో క్లైమాక్స్ ఫైట్ సైతం భారీ స్థాయిలో ఉంటుందని సమాచారం అందుతోంది.పుష్ప ది రూల్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

పుష్ప ది రూల్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉండనున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ప్రేక్షకులకు అంచనాలను భారీగా పెంచుతున్నాయి.పుష్ప ది రూల్ మూవీ ప్రేక్షకులను మెప్పించడం పక్కా అని తెలుస్తోంది.పుష్ప ది రూల్ సినిమా టాలీవుడ్ రేంజ్ ను పెంచడం పక్కా అని తెలుస్తోంది.