అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్( Donald Trump ).ప్రమాణ స్వీకారానికి ముందే తన నిర్ణయాలతో జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాడు.
ఇప్పటికే తన కేబినెట్ సహా, ఉన్నత పదవులకు నియామకాలను వేగంగా పూర్తి చేస్తున్నాడు.ఇదిలాఉండగా.
అమెరికా సైన్యంలో ఉన్న డజన్ల కొద్దీ ట్రాన్స్‌జెండర్లను తొలగించేందుకు ట్రంప్ పావులు కదుపుతున్నారు.దీనిలో భాగంగా ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసేందుకు ట్రంప్ సిద్దమవుతున్నట్లుగా అంతర్జాతీయ దినపత్రిక ది సండే టైమ్స్ నివేదించింది.
ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుంటే దాదాపు 15000 మంది సైనికులు, వారి కుటుంబాలపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సాయంతో వారిని బలవంతంగా సర్వీస్ నుంచి తొలగించవచ్చని భావిస్తున్నారు.గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ట్రాన్స్‌జెండర్లు సైన్యంలో చేరడాన్ని ట్రంప్ నిషేధించారు.అయితే ఇప్పటికే పనిచేస్తున్న వారిని కదిలించకుండా కొత్తగా చేరే ఈ కేటగిరి వ్యక్తులకే నాటి ఉత్వర్వులను వర్తింపజేశారు.
అయితే 2020 అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్( Joe Biden ) తాను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ నిషేధాన్ని రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను జారీ చేశారు.
అయితే ట్రంప్ తాజా నిర్ణయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.దేశానికి సేవ చేసే విభాగంలో లింగ వివక్షత ఉండకూడదని చెబుతున్నారు.ఇప్పటికే తగినంత రిక్రూట్‌మెంట్ జరక్క సైన్యం ఇబ్బంది పడుతున్న వేళ .ఈ నిర్ణయం సరైనది కాదని నెటిజన్లు చురకలంటిస్తున్నారు.కాగా.
ఒక్క సైన్యమే కాకుండా వివిధ రంగాలలో లింగమార్పిడి వ్యక్తుల ప్రయోజనాలపై ఆంక్షలు విధించేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నారు.ఇందులో విద్యారంగం, హెల్త్ కేర్ , క్రీడలు కూడా ఉన్నాయి.
అయితే ట్రంప్ కనుక ట్రాన్స్‌జెండర్స్‌పై ఈ ఆంక్షలను విధిస్తే దీనిపై పోరాడేందుకు ఆ కమ్యూనిటీ కూడా గట్టిగానే సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.