తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు.ఇక అందులో భాగంగానే వారసత్వం పరంగా వచ్చిన హీరోలు ఇప్పుడు స్టార్ హీరోలుగా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.
మరి ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన రామ్ చరణ్( Ram Charan ) లాంటి నటుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన అవసరం అయితే ఉంది.ఇక ఇప్పటికే ఆయన ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ గా అవతరించిన విషయం మనకు తెలిసిందే.
మరి మొత్తానికైతే ఆయనను మించిన నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
![Telugu Buchibabu, Sukumar, Game Changer, Ram Charan, Ramcharan, Tollywood-Movie Telugu Buchibabu, Sukumar, Game Changer, Ram Charan, Ramcharan, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/11/why-Ram-Charan-is-so-confident-about-Buchi-Babu-detailss.jpg)
అయినప్పటికి ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.ఇక బుచ్చిబాబుతో( Buchibabu ) చేస్తున్న సినిమా విషయంలో కూడా ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.ముఖ్యంగా సుకుమార్ ( Sukumar ) లాంటి స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబుకి సపోర్టుగా ఉండటం వల్లే రామ్ చరణ్ ఈ సినిమాకి కమిట్ అయినట్టుగా తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రభినయం చేయబోతున్నట్టుగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఇక ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజర్( Game Changer ) సినిమాలో కూడా రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు.
![Telugu Buchibabu, Sukumar, Game Changer, Ram Charan, Ramcharan, Tollywood-Movie Telugu Buchibabu, Sukumar, Game Changer, Ram Charan, Ramcharan, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/11/why-Ram-Charan-is-so-confident-about-Buchi-Babu-detailsa.jpg)
మరి బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల్లో ద్విపాత్రాభినయం చేయడం వల్ల ఆయన కెరియర్ కి ఏదైనా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయా అంటూ కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు… ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడానికి రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో భారీగా కష్టపడుతున్నాడనే చెప్పాలి…ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఇక భారీ సక్సెస్ ను సాధించడమే లక్ష్యం గా పెట్టుకొని ముందుకు కదులుతున్నాడు…
.