రాజన్న సిరిసిల్ల జిల్లా : దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైస్సార్ రైతులందరికీ మేలు చేసినట్లే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మేలు చేస్తారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నర్సయ్య కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డిలు అన్నారు.సన్నాలు పండించిన రైతులకు క్వింటాలుకు 500 రూపాయలు చొప్పున బోనస్ ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినందుకు బొప్పాపూర్ గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్ల పద్మారెడ్డి గొల్లపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గుడ్ల శ్రీనివాస్ ఎల్లారెడ్డిపేట మండల రైతులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు జరిపారు.
అందులో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గొల్లపల్లి రైతులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కలిసి గొల్లపల్లి బస్టాండులో టపాసులు పేల్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి శనివారం పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సన్నలు విక్రయించిన రైతులకు క్వింటాలుకు 500 రూపాయల చొప్పున బోనస్ రైతుల ఖాతాల్లో టకటక జమ చేస్తుండడంతో రైతులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు కూడా రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని అంటున్నారని వారు తెలిపారు.
దొడ్డు వడ్ల విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు వ్యాపారులకు తిరిగి వాపస్ చేసి సన్న వడ్ల విత్తనాల సంచులు కొనుగోలు చేసి రైతులు తీసుకువెళ్లారని ఇది స్వయంగా బొప్పాపూర్ తాజా మాజీ సర్పంచ్ కొండాపురం బాల్ రెడ్డి నాలుగు ఐదు షాపులను పరిశీలించారని వారు గుర్తు చేశారు.రెండు లక్షల రూపాయల రుణమాఫీ కానీ రైతులు అధైర్య పడవద్దని
డిసెంబర్ 9వ తేదీ న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినం వరకు 2 లక్షల రూపాయల రుణమాఫీ రైతు భరోసా ఇచ్చి తీరుతామని వారు స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తప్పడు మడుమ తిప్పడని వారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ గుండాడి రాంరెడ్డి, డైరెక్టర్లు సూడిది రాజేందర్, కిష్టారెడ్డి, లక్ష్మి బుచ్చ గౌడు , జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు సాహెబ్ మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఏలూరి రాజయ్య , కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపూరి రాజేశం గుప్తా కొండాపురం శ్రీనివాస్ రెడ్డి, వంగ గిరిధర్ రెడ్డి , కొమిరిశెట్టి తిరుపతి , రఫిక్, దేవయ్య, బండారి బాల్ రెడ్డి, గోగురి శ్రీనివాస్ రెడ్డి , గంట అంజా గౌడ్ పుల్లయ్య గారి తిరుపతి గౌడు , పందిల శ్రీనివాస్ గౌడ్ గంట వెంకటేష్ గౌడ్, చల్ల మహేందర్ రెడ్డి, రాచర్ల గొల్లపల్లి బొప్పాపురం రైతులు తదితరులు పాల్గొని రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.