టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు( Samantha ) ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ మామూలు క్రేజ్ కాదనే సంగతి తెలిసిందే.సిటాడెల్ హనీ బన్నీ( Citadel Honey Bunny ) ప్రమోషన్స్ లో భాగంగా సమంత మాట్లాడుతూ అవసరం లేకపోయినా మీరు అత్యధిక మొత్తంలో దేని కోసం ఖర్చు చేశారు అనే ప్రశ్నకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నా మాజీకి ఇచ్చిన ఖరీదైన కానుకలు అని ఆమె చెప్పుకొచ్చారు.ఎంత ధర ఉంటుంది అనే ప్రశ్నకు కొంచెం ఎక్కువే ఇక కొనసాగిద్దాం అంటూ సమంత ముగించారు.
సమంత చేసిన ఈ కామెంట్ల గురించి చైతన్య( Naga Chaitanya ) నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.చైతన్య పేరు ప్రస్తావించకుండానే సమంత ఈ కామెంట్లు చేయడం గమనార్హం.సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం( Maa Inti Bangaram ) సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.సమంత వయస్సు పెరుగుతున్నా తన లుక్స్ తో అదరగొడుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
సమంత స్టార్ హీరోలకు జోడీగా నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.పుష్ప2 సినిమాలో( Pushpa 2 ) సమంత కూడా కనిపిస్తారని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.సమంత రెమ్యునరేషన్ ప్రస్తుతం 3 నుంచి 4 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.సమంత తన రేంజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.ఈ నెలలో సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ తో ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.
అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాగా ఈ వెబ్ సిరీస్ కు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు.
సమంత కొత్త ప్రాజెక్ట్స్ ఎంపికలో జాగ్రత్త వహించాల్సి ఉంది.శాకుంతలం మూవీ ఫలితం సమంత అభిమానులను తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేసింది.ఈ సినిమా నిర్మాతకు తీవ్రస్థాయిలో నష్టాలను మిగిల్చిన సినిమా కావడం గమనార్హం.