ఇదివరకు రోజులలో రాచరిక పాలన ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.ఆ రాజ్యంలో రాజు చెప్పిందే శాసనంగా చాలా కాలం కొనసాగింది.
నిజం చెప్పాలంటే ఇప్పటికి ప్రపంచంలో కొన్ని ప్రాంతాలలో ఈ రాచరిక పాలన కొనసాగుతుంది.ఆ దేశాలలో రాజు చెప్పిందే శాసనంగా ప్రజలు పాటిస్తారు.
ఇదివరకు రాచరిక పాలన సమయంలో రాజులు ఎంతోమంది మహిళలను పెళ్లి చేసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించేవారు.ఇప్పుడు అవన్నీ పోయాయి.
ఎవరో కొందరు మాత్రమే చేస్తున్నారు.దాదాపు అన్ని దేశాలు ప్రజాస్వామిక విధానాన్ని అవలంబిస్తుండగా.
కానీ, కొన్ని దేశాల మాత్రం ఇప్పటికి రాజుల పాలన కొనసాగిస్తున్నారు.ఒక ఇందుకు ఉదాహరణ చూస్తే.
ప్రపంచమంతా ఒకవైపు ఉంటే ఉత్తరకొరియా మాత్రం తాను రూటే సపరేటు అన్నట్లుగా వ్యవహరిస్తుంది.ఆ దేశంలో జరిగే ఆరాచకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ముఖ్యంగా అమ్మాయిల విషయంలో అయితే ఎన్నో నిబంధనలు అక్కడ ఉంటాయి.అయితే ఈ రూల్స్ మించి ఆఫ్రికన్ దేశాలలో( African countries ) ఒకటైన స్వాజీలాండ్ లో కూడా ఈ రూల్స్ అంతకుమించి ఉన్నట్లుగా కనబడుతోంది.
మరి వాటి విశేషాలు ఏందో ఒకసారి చూద్దామా.
స్వాజిల్యాండ్ రాజు( King of Swaziland ) ప్రతి ఏడాది ఒక అమ్మాయిని వివాహం చేసుకుంటాడు.మస్వాతి-3 అని పిలవడే రాజు కుటుంబం చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు.ఎందుకంటే ఆయనకు చాలామంది భార్యలు, పిల్లలు ఉన్నారు.
దక్షిణాఫ్రికాలోని మొజాంబిక్ సమీపంలో( Near Mozambique, South Africa ) ఉన్న ఈ ప్రాంతాన్ని స్వాజీలాండ్ అని ఇదివరకు పిలిచేవారు.ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని ఎస్వాటి అని పిలుస్తున్నారు.
ఇకపోతే ఆ దేశంలో ప్రతి ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ మాసాలలో ఓ ఉత్సవం జరుగుతున్న సమయంలో పదివేల మంది కన్యలు నగ్నంగా నృత్యం చేస్తారు.అలా నృత్యం చేసిన వారిలో ఒక అమ్మాయిని ఎంచుకొని ఆమెను వివాహం చేసుకుంటాడు రాజు.
ఇలా ప్రతి ఏడాది చేసుకోవడం ద్వారా ప్రస్తుతం ఆయనకు 16 మంది భార్యలు ఉన్నారు.ఈ 16 మంది భార్యలకు గాను 45 మంది పిల్లలు కూడా ఉన్నారు.
ఈయన ఆచారంపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఎందుకంటే ఈయన ఏ దేశానికైనా వెళ్లాలంటే అక్కడికి ఆయన 16 మంది భార్యలు అలాగే వారి పిల్లలతో కలిసి వెళుతుంటారు.ఇలా వారి దేశంలో ప్రజలు దౌర్భాగ్యమైన జీవితాన్ని గడుపుతున్న.రాజు మాత్రం విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిపోయాడు.
రాజు ఎక్కడికి వెళ్లినా అందరికీ ఖర్చు పెట్టడానికి చాలా డబ్బు అవసరమవుతుంది.కేవలం విదేశాలకు వెళ్లడం కాదు.
అక్కడ విలాసవంతంగా గడపడం ద్వారా ఆయన అనేకసార్లు ప్రపంచవ్యాప్తంగా విమర్శలను ఎదుర్కొన్నారు.అయితే నగ్నంగా డాన్స్ చేసిన తర్వాత రాజు వివాహం చేసుకోవడం ఏంటని ఓ యువతి అక్కడ వ్యతిరేకించింది.
అలాగే వ్యతిరేకించిన ఆమెకి కొందరు మద్దతుగా నిలవడంతో.వారందరినీ కఠినంగా శిక్షించారు.
అంతేకాదు భారీగా జరిమానా కూడా విధించారు.ఇక 2017లో జరిగిన ఇండియా ఆఫ్రికా సమ్మిట్ పాల్గొన్న సమయంలో ఆ రాజు కుటుంబం ఢిల్లీకి వచ్చింది.
ఆ సమయంలో ఏకంగా ఆ రాజు హోటల్లోని 200 గదులను బుక్ చేశారు.దీన్నిబట్టి చూస్తే ఆ రాజు ఏ విధంగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడో, అలాగే రాజు కుటుంబం ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు.