తెలుగు ప్రేక్షకులకు ప్రముఖ సినీ నటుడు వైసీపీ నేత అయిన పోసాని కృష్ణమురళి( Posani krishna Murali ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకప్పుడు ఎన్నో మంచి మంచి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న పోసాని కృష్ణ మురళి ఆ తర్వాత రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి సినిమాలను పూర్తిస్థాయిలో తగ్గించేశారు.
సినిమాల ద్వారా కంటే రాజకీయాలలో ఎక్కువగా కాంట్రవర్సీలు క్రియేట్ చేసే విధంగా కామెంట్స్ చేస్తూ లేనిపోని వివాదాలను కొని తెచ్చుకుని బాగా వైరల్ అయ్యారు కృష్ణ మురళి.
ఇది ఇలా ఉంటే తాజాగా పోసాని కృష్ణ మురళి రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.రాజకీయాలు, సినిమాలు అంటూ ఫ్యామిలీకి, పిల్లలకు సమయం ఇవ్వలేకపోతున్నానని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.తాజాగా పోసాని కృష్ణ మురళి నిర్ణయంపై యంగ్ ప్రొడ్యూసర్ SKN( Producer SKN ) స్పందించారు.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ పెట్టారు.సార్, ఇప్పుడు అందరికీ అన్నీ గుర్తొస్తాయి.రాజకీయాల( Politics ) నుంచి విరమించుకున్నాను అని నటించే ముందు మా అభిమాన నాయకుడి, గురించి ముఖ్యంగా వారి ఇంట్లోని పసి పిల్లల గురించి మాట్లాడిన నీచమైన, సంస్కారం లేని లేకి వాఖ్యలకి చింతిస్తున్నాను లేదా క్షమించండి అని అడిగి ఉంటే మీ మాటలు నమ్మాలనిపించేది.
ఏదో ఒకసారి పొరపాటుగా మాట్లాడిన వ్యక్తి కాదు మీరు.ఎన్నోసార్లు ఎంతో నీచంగా మాట్లాడారు.అభిమానుల మనసు చాలా అంటే చాలా బాధ పెట్టారు.
ఛీ ఇవేం మాటలు అని చెవులు మూసుకునేలా చేశారు.మీ ఒకళ్ళదే కాదు సార్.
అందరివీ కుటుంబాలే.ఎవరి పిల్లలు అయినా పిల్లలే.
రాజకీయాల్లో విమర్శలు సహజం.కానీ వ్యక్తిగతంగా దిగజారుడు పదాలు, కుటుంబాల మీద కామెంట్స్ చేసిన వారు మాత్రం క్షమార్హులు కాదు అని రాసుకొచ్చారు ఎస్కేఎన్.
ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బాగా చెప్పారు అంటూ కొందరు ఆయనకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.మరి ఈ పోస్ట్ పై పోసాని కృష్ణ మురళి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.