భారతదేశంలో చాలా చోట్ల రైలు ప్రయాణం చేస్తున్న సమయంలో కొందరు యాచకులు, హిజ్రాలు వచ్చి డబ్బులు అడిగి తీసుకోవడం అందరికీ తెలిసిన విషయమే.అయితే, ఇప్పుడు ట్రెండ్ మారింది.
మామూలుగా అడుగుతే డబ్బులు ఇవ్వడం లేదని.ఓ వ్యక్తి ఏకంగా పాములతో రైలు ఎక్కి ప్రయాణికులను హడలెత్తించాడు.
మామూలుగా ఎక్కడైనా సరే రైలు ప్రయాణం అంటే చిరుతిండ్లు, ఇంకా చిన్నపాటి ఆటలు పాటలు లాంటి సంఘటనలు చూసే ఉంటాము.అయితే ఇలా పాములతో రైలు ఎక్కి ప్రయాణికులను బెదిరించి వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం గురించి ఎప్పుడూ వినింది లేదు.
ఈ ఘటన తాజాగా చోటుచేసుకుంది.ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే.

ఓ వ్యక్తి పాములను పాముల బుట్టలో వేసుకొని రైలు ఎక్కాడు.రైలు కొద్దిసేపు ప్రయాణం చేసిన తర్వాత పాములను తీసుకొని ప్రజల వద్దకు వెళ్లాడు.అలా వెళ్లిన అతడు వారిని డబ్బులను డిమాండ్ చేశాడు.ఎవరైతే డబ్బులు ఇవ్వని వారి వద్దకు ఆ పాములను దగ్గరగా తీసుకువెళ్లి భయపడించి వారిని డబ్బులు తీసుకోవడం జరిగింది.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న విషయం మాత్రం ఇంకా తెలియ రాలేదు.ఇది ఏమైనా ప్రయాణం చేస్తున్న సమయంలో ఇటువంటి ధారణ సంఘటనలు చేసుకోవడం నిజంగా భయభ్రాంతులకు గురిచేస్తుంది.ఈ వీడియోని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

నిజంగా ఈ వీడియో చూస్తే ఎవరైనా మహిళలలు లేదా చిన్నారులు ఉంటె మాత్రం ఖచ్చితంగా భయభ్రాంతులకు లోనై ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కళ్ళకు కట్టినట్లుగా అర్థమవుతుంది.ఈ వీడియోని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఇలాంటి వారిని కచ్చితంగా శిక్షకు గురి చేయాల్సిందిగా కోరుతున్నారు.మరికొందరైతే.డబ్బుల కోసం చివరకు ఇంత దారుణానికి పాల్పడుతున్నారా అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.వీడియో గమనించినట్లయితే., ఒక వ్యక్తి బుట్టాలో ఓ నల్ల పామును, అలాగే మెడలో మరో తెల్ల పామును వేసుకొని రైలులోని ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేయడం మనం గమనించవచ్చు.
ఆ వ్యక్తి పాములను చూపిస్తూ డబ్బులను దండుకోవడం మనం వీడియోలో చూడవచ్చు.







