కవిత పొలిటికల్ సైలెన్స్ .. ఆయన సలహానే కారణమా ? 

బీఆర్ఎస్  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జైలు నుంచి బెయిల్ పై విడుదలై బయటికి వచ్చిన తర్వాత నుంచి పొలిటికల్ గా పూర్తిగా సైలెంట్ అయిపోయారు.ఎక్కడా ఆమె హడావుడి కనిపించడం లేదు.

 Why Brs Mlc Kavitha Silent On Telangana Politics Details, Kcr, Kalvakuntla Kavit-TeluguStop.com

పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవ్వడం లేదు.పూర్తిగా పొలిటికల్ గా సైలెంట్ అయిపోయారు.

దీంతో కవితకు( Kavitha ) ఏమైంది.  ఎందుకు రాజకీయంగా సైలెంట్ అయ్యారు అనే ఆసక్తికరమైన చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

దాదాపు పదేళ్లపాటు తెలంగాణ రాజకీయాల్లో( Telangana Politics ) కీలకంగా వ్యవహరించిన కవిత మొదటిసారిగా ఎంపీగా గెలిచినా,  తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందారు.దీంతో ఆమెకు ఎమ్మెల్సీగా  కెసిఆర్ అవకాశం ఇచ్చారు.

Telugu Brs Mlc Kavitha, Brs, Kavitha, Mlc Kavitha, Telangana-Politics

అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్( Delhi Liquor Scam ) వ్యవహారంలో కవిత అరెస్టు కావడం , నెలల తరబడి జైల్లో ఉండడం,  ఇటీవల బెయిల్ పై బయటకు రావడం జరిగాయి.జైల్లో ఉండగానే ఆమెకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో బెయిల్ పై విడుదలైన తర్వాత పూర్తిగా విశ్రాంతికే ఆమె ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది  తెలంగాణ ఉద్యమకాలం నుంచి కవిత తన తండ్రి కెసిఆర్ కు చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నారు.  జాగృతి సంస్థను ఏర్పాటు చేసిన కవిత తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.ఇటీవల బెయిల్ బయటకు వచ్చిన తర్వాత అరెస్టుకు కారణం అయిన బిజెపిపై పోరాడుతారని జైలు బయట నుంచి ప్రకటించారు.

Telugu Brs Mlc Kavitha, Brs, Kavitha, Mlc Kavitha, Telangana-Politics

కానీ ఆమె విశ్రాంతి కే పరిమితం అయ్యారు.తన తండ్రి కెసిఆర్( KCR ) ఫామ్ హౌస్ కు వెళ్లి పది రోజులు పాటు విశ్రాంతి తీసుకున్నారు.జైలులో ఉన్నందున కవిత ఆరోగ్యం క్షీణించింది అని , అందుకే వైద్య పరీక్షల తరువాత విశ్రాంతి కే పరిమితం అయ్యారనే ప్రచారం జరిగింది.బతుకమ్మ పండుగకు కూడా కవిత దూరంగా ఉన్నారు.

దీంతో అసలు కవిత రాజకీయాల్లో కొనసాగుతారా లేదా అనే అనుమానాలు అందరిలోనూ నెలకొన్నాయి.ప్రస్తుతానికి రాజకీయంగా సైలెంట్ గా ఉండడమే మంచిదని,  ఎన్నికల సమయం నాటికి యాక్టివ్ అవ్వాలని , తమ తండ్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన సలహాతోనే కవిత రాజకీయంగా సైలెంట్ అయినట్లుగా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube