సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన దేవాదాయ శాఖ, జౌలి శాఖ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రభుత్వ విప్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో గుడి చెరువు ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను పరిశీలన చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ, జౌలి శాఖ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, దేవాదాయశాఖ కమిషనర్ శ్రీధర్, టూరిజం శాఖ ఎండి హనుమంతు, కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, ఎస్పీ అఖిల్ మహాజన్ లు… హెలిపాడ్, సభ ప్రాంగణం,పార్కింగ్ ఏర్పాట్లు ను పరిశీలించారు.

 Government Whip Adi Srinivas Inspected The Arrangements In The Background Of Cms-TeluguStop.com

ప్రభుత్వ విప్ కామెంట్స్.

రాన్న క్షేత్రం, రాజన్న సిరిసిల్ల జిల్లా సమగ్ర అభివృద్దే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.సీఎంతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితర మంత్రులు రానున్నారు.

నూలు డిపో ఏర్పాటు నేతన్నల చిరకాల కోరిక…సీఎం రాకతో నేతన్నల 30ఏండ్ల కల నెరవేరనుంది.శృంగేరి పీఠం వారి ఆదేశాల మేరకు బ్రాహ్మణుత్సవములచే రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నాం.

రాజన్న భక్తులకు సులువుగా శీఘ్రమైన దర్శనం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.ఆనాడు పి.సి.సి అధ్యక్షుడి హోదాలో వచ్చిన రేవంత్ రెడ్డి నేడు సీఎం హోదాలో ఆలయానికి వచ్చి రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడాలని స్వామివారిని వేడుకుంటారు.గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల ప్రకటించిన బడ్జెట్లో రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.50కోట్లు కేటాయించడం జరిగింది…

సీఎం పర్యటనలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయం, యారన్ డిపోతో పాటు రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేస్తారు.సీఎం పర్యటనతో ఇప్పటికే ముగింపు దశకు చేరుకున్న ప్రాజెక్టు పనులతో పాటు శ్రీపాద ప్రాజెక్టు పనులకు అడుగులు పడనున్నాయి.సీఎం పర్యటనకు సంబంధించి సభ వేదిక, హెలిప్యాడ్ వంటి ఏర్పాట్లను పరిశీలించాం.

పర్యటనకు సంబంధించి అన్ని రకాల పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం.జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సీఎం పర్యటనకు సంబంధించి మినిట్ టూ మినిట్ షెడ్యూల్ తయారవుతుంది.

ఈనెల 20వ తేదీ బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు రాజన్న ఆలయ గుడి చెరువు ప్రాంగణంలో సీఎం బహిరంగ సభ ఉంటుంది.రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కొనసాగనున్న సీఎం సభకు జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజల తరలివచ్చి విజయవంతం చేయాలి.

వారి వెంట దేవాదాయ శాఖ స్థపతి వల్లి నాయగం, ఈవో వినోద్ రెడ్డి,ఇతర అధికారులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube