ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న ప్రాజెక్ట్ ఏదనే ప్రశ్నకు మహేష్ రాజమౌళి కాంబో మూవీ ఒకటని చెప్పడంలో సందేహం అవసరం లేదు.రాజమౌళి( Rajamouli ) సినిమాలు సక్సెస్ సాధించడంతో ఆయన టీమ్ కృషి సైతం ఎంతో ఉందని చెప్పవచ్చు.
అయితే జక్కన్న మహేష్ కాంబోకు భారీ షాక్ తగిలిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.కె.సెంథిల్( KK Senthil Kumar ) ఈ సినిమాకు తాను పని చేయడం లేదని చెప్పారు.
ప్రస్తుతం సెంథిల్ స్వయంభూ సినిమా కోసం పని చేస్తున్నారు.మంచి అవకాశం వస్తే చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా చూడనని ఆయన వెల్లడించారు.మహేష్( Mahesh Babu ) రాజమౌళి కాంబో సినిమాకు ఎవరు పని చేస్తారనేది రాజమౌళి నిర్ణయం అని తెలిపారు.ఆ సినిమాకు కొత్త టెక్నీషియన్ అవసరం ఉందని జక్కన్న భావించి ఉండవచ్చని సెంథిల్ పేర్కొన్నారు.
తాను తప్పుకోలేదని జక్కన్నే తప్పించారని సెంథిల్ పరోక్షంగా క్లారిటీ ఇచ్చేశారు.

మా మధ్య రిలేషన్ దెబ్బ తిందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని సెంథిల్ పేర్కొన్నారు.తమ మధ్య మంచి అనుబంధం ఉందని రాజమౌళి చాలా గొప్ప వ్యక్తి అని తెలిపారు.ఒక సినిమాకు కలిసి పని చేయనంత మాత్రాన సంబంధాలు దెబ్బ తిన్నాయని ఎలా అనుకుంటారని సెంథిల్ ప్రశ్నించారు.
గతంలో సైతం మేమిద్దరం వర్క్ చేయని సందర్భాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

సెంథిల్ ను ఈ సినిమా నుంచి తప్పించడం గురించి రాజమౌళి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.అమెజాన్ అడవుల బ్యాక్ డ్రాప్ లో మహేష్ జక్కన్న కాంబో మూవీ తెరకెక్కుతోంది.ఈ సినిమా కోసం జక్కన్న ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
మహేష్ రాజమౌళి కాంబో ఏ రేంజ్ లో రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.







