ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఒక వీడియోలో, వర్క్ ఫ్రమ్ హోమ్( Work From Home ) కల్చర్‌ని చాలా ఫన్నీగా చూపించారు.ఈ వీడియోలో ఆర్య( Aarya ) అనే చిన్నారి, ఒక కఠినమైన మేనేజర్‌లా నటిస్తూ, తన ఉద్యోగి వర్క్ ఫ్రం హోం ఫెసిలిటీ కల్పించమని అడిగితే ఎలా స్పందిస్తుందో చూపించారు.
వైరల్ వీడియో( Viral Video ) ప్రకారం, ఆర్య ఒక ఆఫీస్‌లో కూర్చుని, ల్యాప్‌టాప్ ముందు ఉన్నది.ఆమె ఉద్యోగి ఆఫీస్ ఇంటికి దూరంగా ఉందని చెప్పి, ఇంటి నుంచే పని చేసేలా ఛాన్స్ ఇవ్వాలని అడుగుతాడు.
ఆర్య ముందుగా ఆయనకు కొన్ని సలహాలు ఇస్తుంది.కారులో వెళ్ళమని, బైక్‌లో వెళ్ళమని చెప్తుంది.కానీ ఆయనకు కారు, బైక్ లేవని చెప్పడంతో, ఆర్య మరోసారి వర్క్ ఫ్రం హోమ్‌కి అనుమతి ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తుంది.
ఆర్యను ఉద్యోగి పదేపదే ఒకటే ప్రశ్న అడిగి విసిగిస్తాడు.దాంతో ఈ చిట్టి మేనేజర్( Child Manager ) అతనికి కొన్ని ఫన్నీ సలహాలు ఇస్తూనే ఉంటుంది.స్కేట్‌బోర్డ్ మీద ఆఫీస్ కి రావచ్చు కదా అని సలహా ఇస్తుంది.
కానీ ఆయన స్కేట్‌బోర్డ్ మీద ఆఫీసుకు రావడానికి భయపడుతున్నానని చెప్పడంతో, జాగింగ్ చే చేస్తూ రమ్మని సూచిస్తుంది.అయితే ఆఫీస్ చాలా దూరంగా ఉందని ఆయన చెప్పడంతో, ఆర్య చివరకు చాలా ఫన్నీ సొల్యూషన్ కనుక్కొంది.ఆమే ప్రతిరోజు ఆయన ఇంటికి వెళ్లి తీసుకుని వెళ్తానని చెప్పింది.“ఎవరీ డే సార్” అని ఈ చిన్నారి ముద్దు ముద్దుగా చెప్పిన తీరు చాలా ఫన్నీగా అనిపించింది.
నవంబర్ నెలలో అప్‌లోడ్ చేసిన ఈ వీడియో ఇప్పటికే ఆరు మిలియన్ల మంది చూశారు.ఈ బాలిక అమాయకత్వంగా కనిపిస్తూనే WFH రిక్వెస్ట్‌ని చాలా బాగా హ్యాండిల్ చేసింది.ఇదంతా కూడా ఫన్నీగా అనిపించింది.అందుకే ఈ వీడియో ప్రజలకు చాలా నచ్చింది.దీన్ని మీరు కూడా చూసేయండి.