ప్రస్తుత చలికాలంలో పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది చుండ్రు సమస్యతో( Dandruff ) బాధపడుతుంటారు.మలాసెజియా అనే ఈస్ట్ లాంటి ఫంగస్ పెరుగుదల వల్ల చుండ్రు ఏర్పడుతుంది.
చుండ్రు కారణంగా జుట్టు రాలడం( Hair Fall ) అధికమవుతుంది.తలలో దురద, చిరాకు వంటివి పెరిగిపోతాయి.
దీనికి తోడు చుండ్రు పొరలు పొరలుగా దుస్తులు మరియు భుజాలపై పడి అసహ్యంగా కనిపిస్తుంది.ఈ క్రమంలోనే చుండ్రును వదిలించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.

అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే చిట్కా ఉత్తమంగా తోడ్పడుతుంది.అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక నాలుగో రెబ్బలు వేసుకోవాలి.అలాగే రెండు లేదా మూడు బిర్యానీ ఆకులు,( Biryani Leaves ) అంగుళం దాల్చిన చెక్క,( Cinnamon ) పది లవంగాలు( Cloves ) వేసి మరిగించాలి.
దాదాపు పది నుంచి పన్నెండు నిమిషాల పాటు మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆవ నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.దాంతో ఒక మంచి హెయిర్ టోనర్ రెడీ అవుతుంది.గోరువెచ్చగా అయ్యాక ఈ టోనర్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకొని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.
ఆపై స్కాల్ప్ ను మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒక్కసారి ఈ విధంగా కనుక చేశారంటే చుండ్రు అన్న మాటే అనరు.ఈ టోనర్ నెత్తిపై చుండ్రును సంపూర్ణంగా తొలగిస్తుంది.
స్కాల్ప్ ను హెల్తీ గా మారుస్తుంది.అలాగే ఈ టోనర్ ను ఉపయోగించడం వల్ల జుట్టు రాలే సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది.







