తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.శుక్రవారం (నవంబర్ 15 )న బాలకృష్ణ నటిస్తున్న NBK 109 సినిమాకు సంబంధించిన టైటిల్, టీజర్ ను రిలీజ్ చేశారు చిత్ర బృందం.
ఈ సినిమాకు బాబీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు అనేక పేర్లు తెర మీకు వచ్చిన కానీ.
ఫైనల్ గా ” డాకు మహారాజు ” ( Daku Maharaju )అనే పేరును ఫిక్స్ చేసినట్లు అధికారికంగా నేడు ప్రకటన చేశారు.టైటిల్ తో పాటు టీజర్ ను కూడా ప్రేక్షకులకు అందజేసింది సినిమా యూనిట్.

ఇక ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ( Sitara Entertainments banner )మీదుగా నాగ వంశీ స్వగవరంగా నిర్మిస్తున్నారు.నందమూరి బాలకృష్ణ అభిమాని అయిన నాగవంశీ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఫాన్స్ కు భారీ అంచనాలు మొదలయ్యాయి.అందుకు తగ్గట్టుగానే థమన్ మరోసారి సంగీతాన్ని అందిస్తున్నట్లు సమాచారం.ఇక టీజర్ విషయానికి వస్తే.ఎప్పటిలాగానే తనదైన మ్యూజిక్ తో టీజర్ మొత్తాన్ని వేరే లెవెల్ కు తీసుకెళ్లాడు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.
దానికి తోడు నిన్ననే నాగ వంశీ అసలు బాలకృష్ణ సినిమాలకి థమన్ మ్యూజిక్ ఎందుకు ఉండాలో ఈ టైటిల్ టీజర్ చూసిన తర్వాత మీకే అర్థమవుతుందంటూ క్లారిటీ ఇచ్చారు.

ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన పలు చిత్రాలు విశేషంగా ఆకట్టుకొన్నాయి.ఈ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.పోస్టర్లు, రెండు భారీ యాక్షన్ గ్లింప్స్‌లు ప్రేక్షకుఅల్ను మెప్పించాయి.
ఇకపోతే, ఇదివరకు బాలకృష్ణను ఎప్పుడు చూడని కొత్త అవతారంలో దర్శకుడు చూపిస్తున్న విధానానికి అందరూ ఆశర్యనికి లోనయ్యారు.







