డాకు మహారాజ్ గా వచ్చేస్తున్న బాలయ్య బాబు (వీడియో)
TeluguStop.com
తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
శుక్రవారం (నవంబర్ 15 )న బాలకృష్ణ నటిస్తున్న NBK 109 సినిమాకు సంబంధించిన టైటిల్, టీజర్ ను రిలీజ్ చేశారు చిత్ర బృందం.
ఈ సినిమాకు బాబీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు అనేక పేర్లు తెర మీకు వచ్చిన కానీ.
ఫైనల్ గా " డాకు మహారాజు " ( Daku Maharaju )అనే పేరును ఫిక్స్ చేసినట్లు అధికారికంగా నేడు ప్రకటన చేశారు.
టైటిల్ తో పాటు టీజర్ ను కూడా ప్రేక్షకులకు అందజేసింది సినిమా యూనిట్.
"""/" /
ఇక ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ( Sitara Entertainments Banner )మీదుగా నాగ వంశీ స్వగవరంగా నిర్మిస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ అభిమాని అయిన నాగవంశీ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఫాన్స్ కు భారీ అంచనాలు మొదలయ్యాయి.
అందుకు తగ్గట్టుగానే థమన్ మరోసారి సంగీతాన్ని అందిస్తున్నట్లు సమాచారం.ఇక టీజర్ విషయానికి వస్తే.
ఎప్పటిలాగానే తనదైన మ్యూజిక్ తో టీజర్ మొత్తాన్ని వేరే లెవెల్ కు తీసుకెళ్లాడు.
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.దానికి తోడు నిన్ననే నాగ వంశీ అసలు బాలకృష్ణ సినిమాలకి థమన్ మ్యూజిక్ ఎందుకు ఉండాలో ఈ టైటిల్ టీజర్ చూసిన తర్వాత మీకే అర్థమవుతుందంటూ క్లారిటీ ఇచ్చారు.
"""/" /
ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన పలు చిత్రాలు విశేషంగా ఆకట్టుకొన్నాయి.
ఈ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.పోస్టర్లు, రెండు భారీ యాక్షన్ గ్లింప్స్‌లు ప్రేక్షకుఅల్ను మెప్పించాయి.
ఇకపోతే, ఇదివరకు బాలకృష్ణను ఎప్పుడు చూడని కొత్త అవతారంలో దర్శకుడు చూపిస్తున్న విధానానికి అందరూ ఆశర్యనికి లోనయ్యారు.