మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ( Varun Tej ) నటించిన మట్కా సినిమా ( Matka Movie ) నవంబర్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు అయితే గత రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను వైజాగ్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా చర్చలకు కారణమయ్యాయి.ఈ కార్యక్రమంలో వరుణ్ తేజ్ తన పెదనాన్న చిరంజీవి తన తండ్రి బాబాయ్ పవన్ కళ్యాణ్ గురించి ఎన్నో విషయాలు తెలిపారు.
నేడు నేను ఇక్కడ ఉన్నాను అంటే అందుకు కారణం తన కుటుంబ సభ్యులేనని వరుణ్ తేజ్ తెలిపారు.ఇక తన అన్నయ్య చరణ్( Charan ) గురించి కూడా ఎన్నో విషయాలు తెలిపారు.నాకు ఏదైనా కష్టం వచ్చింది అంటే ముందుగా గుర్తొచ్చే వ్యక్తి చరణ్ అన్న.నాకు బాధ అనిపించినా సినిమాల పరంగా ఎలాంటి టెన్షన్ అనిపించిన ముందుగా అన్నయ్యతో మాట్లాడుతానని ఆయన నా భుజంపై అలా చేయి వేస్తే చాలు నాకు కొండంత ధైర్యం వస్తుందని అదే నాకు 1000 కోట్లతో సమానమని చరణ్ గురించి వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇలా నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నాన్న బాబాయ్ పెదనాన్న కారణం.జీవితంలో మనకు సక్సెస్ వచ్చిన తరువాత మనకు సపోర్ట్ ఇచ్చిన వారిని ఎప్పుడు మర్చిపోకూడదు అలా మర్చిపోయాము అంటే నీ సక్సెస్ ఎందుకు పనికిరాదు అంటూ ఈ సందర్భంగా వరుణ్ తేజ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈయన ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారు అన్నది చర్చలకు కారణమైంది.వరుణ్ తేజ్ ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ ఉద్దేశించి పరోక్షంగా ఇలాంటి కామెంట్లు చేశారని పలువురు భావిస్తున్నారు అయితే ఈ విషయంపై మరోసారి మెగా అభిమానులు అల్లు అభిమానులు మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతుంది.