వీడియో: వీధుల్లో నడుస్తున్న యువతిని అసభ్యంగా తాకిన పదేళ్ల అబ్బాయి..

సమాజంలో మహిళలకు భద్రతపై లేకుండా పోతోంది.పట్టపగలే అందరూ చూస్తుండగానే కామాంధులు రెచ్చిపోతున్నారు.

 Video: A Ten-year-old Boy Molested A Young Girl Roaming The Streets Of Bangalore-TeluguStop.com

ఈ దృశ్యాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.మామూలు ఆడవారికి మాత్రమే కాదు ప్రముఖలుగా ఉన్న ఆడవారిపై కూడా కామాంధులు దాడులకు పాల్పడుతున్నారు.

వారికే ఇలాంటి అనుభవం ఎదురైతే, సామాన్య మహిళల పరిస్థితి ఏమిటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది.ఈ క్రమంలోనే తాజాగా బెంగళూరుకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ నేహా బిస్వాల్‌కు(Neha Biswal) ఇలాంటి అనుభవం ఎదురయ్యింది.

నవంబర్ 5వ తేదీన బీటీఎం లేఅవుట్‌లో(BTM Layout) వీడియో రికార్డ్ చేస్తుండగా ఆమెను ఆ బాలుడు అసభ్యకరంగా తాకి పారిపోయాడు.నేహా తన ఇంటికి వెళ్తూ తన ఫోన్‌తో వీడియో రికార్డ్ చేస్తుండగా, సైకిల్‌పై వస్తున్న 10 ఏళ్ల బాలుడు ఆమెను అసభ్యంగా తాకాడు.

ఈ ఘటన మొత్తం కెమెరాలో రికార్డ్ అయింది.నేహా తన ఇన్‌స్టాగ్రామ్‌లో)(Instagram) తన 4 లక్షల మంది ఫాలోవర్లతో ఈ ఘటనను పంచుకున్నారు.ఆమె ఒక ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్నారు.

“ఇలాంటి సంఘటన నా జీవితంలో ఇంతకు ముందు జరగలేదు.నేను చాలా బాధ పడుతున్నాను.నడుస్తూ వీడియో చేస్తుండగా ఈ ఘటన జరిగింది.ఆ బాలుడు మొదట నేను వెళ్తున్నా ఒకే డైరెక్షన్లో ముందుకు వెళ్ళాడు.ఆ తర్వాత నన్ను చూసి తిరిగి నా వైపు వచ్చాడు.

నేను మాట్లాడుతున్న తీరును అనుకరించి నన్ను వేధించాడు.ఆ తర్వాత నన్ను అసభ్యంగా తాకాడు.” అని నేహా వెల్లడించారు.నేహా అసభ్యంగా తాకిన బాలుడిని స్థానికుల సహాయంతో పట్టుకుంది.

అయితే చాలామంది బాలుడిని క్షమించమని కోరారు.ఆ బాలుడు చిన్నపిల్లవాడు అని వారు వాదించారు.

అక్కడ గుమిగూడిన చాలామంది తనకు మద్దతు ఇవ్వలేదని నేహా చెప్పారు.బాలుడు పట్టుబడినప్పుడు, సైకిల్‌పై తన బ్యాలెన్స్ కోల్పోయి ఆమెను తాకినట్లు చెప్పాడు.

“అతను ఏం చేశాడో వీడియోలో స్పష్టంగా చూపించిన తర్వాతే ప్రజలు నన్ను నమ్మారు” అని నేహా వివరించారు.“అతను చిన్న పిల్లవాడు కాబట్టి వదలమని చాలామంది అడిగారు కానీ నేను ఆగలేదు.అతన్ని కొట్టాను.కొంతమంది నాకు మద్దతు ఇచ్చి అతన్ని కొట్టారు కానీ, నిజాయితీగా చెప్పాలంటే నాకు ఇక్కడ సురక్షితంగా అనిపించడం లేదు” అని వీడియో చివరలో నేహా (NEHA)చెప్పారు.

నేహా బాలుడిపై ఫిర్యాదు చేయకపోయినప్పటికీ, బెంగళూరు పోలీసులు (Bangalore police)ఈ ఘటనను విచారిస్తున్నారని ఆమె తన తదుపరి వీడియోలో తెలిపారు.ఈ ఘటనకు బాధ్యుడిని గుర్తించడానికి సీసీటీవీ(CCTV) ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.“అతడు ఒక బాలుడు అని కనికరించి నేను ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయలేదు.అతని భవిష్యత్తు నాశనం చేయాలని నేను కోరుకోవడం లేదు.

కానీ అతన్ని పట్టుకుని హెచ్చరించాలని నేను కోరుకుంటున్నాను” అని ఆమె వివరించారు.పోలీసులు సహాయంగా ఉండి తనకు సురక్షితంగా అనిపించేలా చేశారని నేహా కూడా చెప్పారు.“వారు నన్ను స్థానికురాలిగా భావించలేదు, కానీ ఈ ఘటన జరిగినందుకు నేను ఇప్పటికీ బాధగా ఉన్నాను” అని ఆమె చెప్పారు.మనీ కంట్రోల్ ప్రకారం, డీసీపీ సౌత్ సారా ఫాతిమా నిందితుడిని అరెస్టు చేశారని, కేసును విచారిస్తున్నారని ధృవీకరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube