సాధారణంగా ప్రతిరోజు కూడా లక్షల మంది రైలు ప్రయాణాలు చేస్తూ ఉంటారు.రైలు ఎక్కే క్రమంలో కొంత మంది జాగ్రత్తగా ఎక్కుతూ ఉంటే.
మరికొందరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.అయితే తాజాగా ఉత్తరప్రదేశ్ కాన్పూర్ రైల్వే స్టేషన్లో( Kanpur Railway Station ) ఘోర ప్రమాదం సంభవించింది.
కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన యువతి ప్లాట్ ఫామ్ పై నుంచి ట్రాక్ పై కింద పడి గాయాలతో బయటపడింది.ఆగి ఉన్న రైల్లో నుంచి ఒక యువతి స్నాక్స్ కొనుగోలు చేసేందుకు ప్లాట్ఫామ్ పై దిగింది.
అనంతరం రైలు( Train ) కదలడం గమనించి ఆమె పరిగెత్తి ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నం చేసే క్రమంలో ఆమెకు స్వల్పంగా గాయాలైనట్లు తెలుస్తుంది.చికిత్స కొరకు రైల్వే హాస్పిటల్ కి( Railway Hospital ) పంపించారు.ప్రస్తుతం, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి.రైలు ఎక్కే క్రమంలో ప్రమాదశాత్తు పట్టాలపై పడి ప్రాణాలు సైతం కూడా కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు.ఇలాంటి దారుణమైన సంఘటనాల పట్ల రైల్వే అధికారులు ఎప్పటికప్పుడు ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నా కానీ ఇలాంటివి జరగడం మాత్రం ఆగడం లేదు.
రైలు ఆగిన తర్వాతే ట్రైన్ ఎక్కాలని ఎప్పటికప్పుడు ప్రకటనలు కూడా చేస్తుంటారు.కానీ చాలామంది అవేమీ పట్టించుకోకుండా వారికి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు.ఇక కొంతమంది ఆలస్యంగా రైల్వే స్టేషన్కు చేరుకోవడం వల్ల హడావిడిగా రైలు ఎక్కే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు.ఇక ఈ వీడియోలో చూసిన కొంతమందిని నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
ట్రైన్ ఎక్కే క్రమంలో పలు జాగ్రత్తలు తప్పనిసరని కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటే.ఆ మహిళ చాలా అదృష్టవంతురాలని మరికొందరు కామెంట్ చేస్తున్నారు
.