ఈ పవర్ ఫుల్ రెమెడీతో పసుపు దంతాలకు చెప్పండి గుడ్ బై..!

సాధారణంగా కొందరి దంతాలు పసుపు రంగులో కనిపిస్తుంటాయి.దంత సంరక్షణ లేకపోవడం, ఆహారపు అలవాట్లు, స్మోకింగ్ తదితర కారణాల వల్ల దంతాలు ( teeths )పసుపు రంగులోకి మారి అసహ్యంగా కనిపిస్తుంటాయి.

 Say Goodbye To Yellow Teeth With This Home Remedy! Home Remedy, Latest News, Hea-TeluguStop.com

ఇటువంటి దంతాలను తెల్లగా మెరిపించుకునేందుకు ఎంతో ఖరీదైన టూత్ పేస్ట్ లను వినియోగిస్తూ ఉంటారు.అయినా సరే ఫలితం అంతంత మాత్రంగా ఉంటే ఏం చేయాలో తెలియక మదన పడుతూ ఉంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ హోమ్ రెమెడీ మీకు ఉత్తమంగా సహాయపడుతుంది.ఈ రెమెడీని ఫాలో అయ్యారంటే పసుపు దంతాలకు సులభంగా మరియు వేగంగా గుడ్ బై చెప్పవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Telugu Tips, Latest, Goodbyeyellow, Teeth, Teeth Remedy, Yellow Teeth-Telugu Hea

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టీ స్పూన్ అల్లం పొడి ( Tea spoon ginger powder )వేసుకోవాలి.అలాగే వన్ టీ స్పూన్ లవంగాల పొడి( Clove powder ), పావు టీ స్పూను పసుపు,( Turmaric ) రెండు టీ స్పూన్లు వైట్ టూత్ పేస్ట్‌ మరియు హాఫ్ టీ స్పూన్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బాక్స్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.రోజు ఉదయం ఈ మిశ్రమాన్ని ఉపయోగించి దంతాలను రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా తోముకోవాలి.

ఆపై వాటర్ తో శుభ్రంగా దంతాలను మరియు నోటిని క్లీన్ చేసుకోవాలి.

Telugu Tips, Latest, Goodbyeyellow, Teeth, Teeth Remedy, Yellow Teeth-Telugu Hea

ఈ విధంగా బ్రష్ చేసుకోవడం వల్ల దంతాలపై ఏర్పడిన పసుపు మరకలు తొలగిపోతాయి.దంతాలు తెల్లగా కాంతివంతంగా మారతాయి.అలాగే పైన చెప్పిన హోమ్ రెమెడీని పాటించడం వల్ల దంతాల పోటు, దంత క్షయం వంటి సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.

అంతేకాకుండా ఈ రెమెడీ చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తస్రావం వంటి సమస్యలకు సైతం అడ్డుకట్ట వేస్తుంది.కాబట్టి పసుపు దంతాలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న హోమ్ రెమెడీని ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube