కొద్ది రోజుల క్రితం దీపావళి పండుగ ( Diwali festival )సందర్భంగా భారతదేశం అంతా టపాసులు కాలుస్తూ బాగా ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఇదే పర్వదినాన కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయి తీవ్ర విషాదాన్ని మిగిల్చారు.
బెంగళూరులోని కోననకుంటే ప్రాంతంలో అన్నిటికంటే మరింత విషాదమైన సంఘటన చోటుచేసుకుంది.ఓ యువకుడు ఫైర్‌క్రాకర్స్ బాక్స్ పై ( Firecrackers box pie )కూర్చొని ఉండగా స్నేహితులు వాటన్నిటినీ ఒకేసారి పేల్చేశారు.
ఈ ఘటనలో సదరు యువకుడు దుర్మరణం చెందాడు.
ఈ దారుణ ఘటన సీసీ కెమెరాలో రికార్డయింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా వ్యాపిస్తోంది.వీడియోలో, కొందరు స్నేహితులు ఆ యువకుడిని టపాసుల పెట్టెపై కూర్చోబెట్టి, వాటికి నిప్పు పెట్టారు.
దీంతో భారీ పేలుడు సంభవించి ఆ యువకుడు మరణించాడు.ఈ ఘటన నవంబర్ 1వ తేదీ శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో జరిగింది.
మృతుడిని శబరిష్‌గా గుర్తించారు.శబరిష్ స్నేహితులు అతనిని ఫైర్ క్రాకర్స్ పెట్టెపై కూర్చోవాలని సవాలు విసిరారు.
అలా చేస్తే ఆటో రిక్షా ఇస్తామని వాగ్దానం చేశారు.శబరిష్ ఆ సవాలును అంగీకరించి ఆ పెట్టెపై కూర్చున్నాడు.తర్వాత వాటిని పేల్చడం, శబరిష్ అక్కడికక్కడే మరణించడం జరిగిపోయాయి.
ఈ ఘటన జరిగే సమయంలో శబరిష్ ( Sabarish )మద్యం సేవించి ఉండవచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.వీడియోలో, శబరిష్ స్నేహితులు ఫైర్ క్రాకర్స్ బాక్స్‌కు నిప్పు పెట్టి వెంటనే సురక్షితమైన దూరం చేరుకున్నట్లు కనిపిస్తోంది.శబరిష్ చనిపోయాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర శోకానికి గురయ్యారు.
శబరిష్ స్నేహితులు చేసిన సరదా సవాలు అతని జీవితాన్ని బలి తీసుకుంది.శబరిష్ కుటుంబం ఈ ఘటనపై విచారణ జరిపి, అతని మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతోంది.
పోలీసులు ఈ కేసును పరిశీలిస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.