తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Tollywood ) ఇప్పటివరకు కనీవిని ఎరగని రీతిలో సినిమాలను చేసి మంచి సక్సెస్ లను సాధిస్తున్నారు.నిజానికి వాళ్లంతా చేసిన సినిమాల విషయం పక్కనపెడితే ఇప్పుడు చేయబోయే సినిమాల మీద ప్రేక్షకుల్లోవిపరీతమైన అంచనాలైతే ఉంటున్నాయి.ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటేనే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు నిలబడగలుగుతాం అనే ఉద్దేశ్యంతో కొంతమంది స్టార్ డైరెక్టర్లు సైతం వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు…
ఇక ఇప్పుడున్న పరిస్థితిలో రాజమౌళి( Rajamouli ) లాంటి స్టార్ డైరెక్టర్ ఇండియా వ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని పెంచాడనే చెప్పాలి.ఇక ఆయన తర్వాత తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకులు ఇప్పుడిప్పుడు చాలా మంది వస్తున్నారు.ముఖ్యంగా నాగ్ అశ్విన్,( Nag Ashwin ) ప్రశాంత్ వర్మ,( Prasanth Varma ) సుకుమార్, సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్లు ముందుకు సాగుతున్న క్రమంలో వీళ్ళందరూ కలిసి పాన్ ఇండియాలో అద్భుతాలను సృష్టిస్తున్నారు.ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎలా ఉన్నా కూడా ఇక మీదట నుంచి కొత్త పుంతలు తొక్కుతు ముందుకు సాగుతుందనే చెప్పాలి.
ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీ( Indian Cinema Industry ) అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ నే అని చెప్పేంత గొప్పగా మన సినిమాలు ఉండటం అనేది నిజంగా అందరం గర్వించదగ్గ విషయమనే చెప్పాలి.చూడాలి మరి ఇకమీదట కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చే సినిమాలతో మ్యాజిక్ ను చేయగలిగితే మన ఇండస్ట్రీని దాటి ముందుకు దూసుకెళ్లే అవకాశాలు అయితే లేవు.ఇక ఇప్పటికే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ వన్ ఇండస్ట్రీగా కొనసాగుతూ ముందుకు వెళ్తుంది.ఇక మీదట కూడా ఇలాంటి సినిమాలు చేస్తే ఇక ఎప్పటికీ మన ఇండస్ట్రీనే టాప్ లెవల్లో ఉంటుంది…