మాలాంటి హీరోలకు అలాంటి డైలాగు చెప్పే హక్కు లేదు: దుల్కర్ సల్మాన్

మలయాళ చిత్ర పరిశ్రమలో నటుడిగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు పొందిన వారిలో నటుడు దుల్కర్ సల్మాన్( Dulquer Salman ) ఒకరు.ఈయన ప్రముఖ నటుడు మమ్ముట్టి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మలయాళ చిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు.

 Dulquer Salman Sensational Comments On Star Heroes Details, Dulquer Salman, Luck-TeluguStop.com

ఇక మహానటి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన దుల్కర్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.అనంతరం ఈయన సీతారామం( Sitaramam ) అనే పూర్తిస్థాయి తెలుగు సినిమాలో నటించారు ఈ సినిమాలో వీరి నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అవడమే కాకుండా ఈయనకు తెలుగులో భారీ స్థాయిలో క్రేజ్ ఏర్పడింది.

Telugu Dulquer Salmaan, Dulquer Salman, Lucky Bhaskar, Punch Dialogue, Heroes, V

ఈ సినిమా తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగు సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు  తాజాగా వెంకి అట్లూరి దర్శకత్వంలో ఈయన నటించిన చిత్రం లక్కీ భాస్కర్( Lucky Bhaskar ).ఈ సినిమా దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమా విడుదలకు ముందు పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.అయితే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయనకు యాంకర్ నుంచి ఒక ప్రశ్న ఎదురైంది.

దుల్కర్ సల్మాన్ నటించే సినిమాలలో ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా ఒక పంచ్ డైలాగ్ వేసింది లేదు.అలా ఎందుకు అంటూ ప్రశ్న వేశారు ఈ ప్రశ్నకు ఈయన ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.

Telugu Dulquer Salmaan, Dulquer Salman, Lucky Bhaskar, Punch Dialogue, Heroes, V

కొంతమంది అతిపెద్ద సూపర్ స్టార్లకు మాత్రమే పంచ్ డైలాగులు చెప్పే హక్కు ఇచ్చేశాం.నాలాంటి యాక్టర్లు అలాంటి డైలాగులు చెప్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు అంటూ ముక్కు సూటిగా తన మనసులో ఉన్న సమాధానం బయట పెట్టేశారు.ఇలా పంచ్ డైలాగులు చెప్పాలంటే ఒక అర్హత ఉండాలని ఈయన చెప్పకనే చెప్పేశారు.ప్రస్తుతం దుల్కర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఈయన చివరిగా కింగ్ ఆఫ్ కోట అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా పెద్దగా సక్సెస్ అందుకోలేదని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube