వేణు స్వామి( Venu swamy ) సోషల్ మీడియాలో తన జ్యోతిష్యం ద్వారా సంచలనగా మారారు.ఈయన గతంలో సమంత ( Samantha ) నాగచైతన్య ( Nagachaitanya ) విడిపోతారంటూ చేసిన వ్యాఖ్యలు నిజం కావడంతో ఈయన చెప్పే జ్యోతిష్యాన్ని నమ్మే వారి సంఖ్య అధికమైంది.
ఇలా వేణు స్వామి చెప్పిన కొన్ని విషయాలు నిజం కావడంతో ఈయన తరచూ సోషల్ మీడియా వేదికగా సినిమా సెలబ్రిటీల గురించి అలాగే రాజకీయ నాయకుల గురించి చెబుతూ వార్తలలో నిలిచారు.ఇక రెండో తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఈయన చెప్పిన జ్యోతిష్యం 100కు 100% తప్పు అయింది.
దీంతో భారీ విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఈ విధంగా వేణు స్వామి జ్యోతిష్యం తప్పు కావడంతో ఈయన ఇకపై తాను సోషల్ మీడియా వేదికగా ఎవరి గురించి జాతకం చెప్పనని తెలిపారు.అయితే కొంతకాలం పాటు సైలెంట్ గా ఉన్న వేణు స్వామి నాగచైతన్య తిరిగి శోభితను( Sobhita ) పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసి ఈయన మరోసారి వారి జాతకం గురించి ఒక వీడియో చేశారు.సమంత నాగచైతన్య లాగే శోభిత నాగచైతన్య కూడా ఒక స్త్రీ కారణంగా విడిపోతారని ఈయన మరో బాంబు పేల్చారు.

ఇలా శోభిత నాగచైతన్య జీవితం గురించి వేణు స్వామి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఫిల్మ్ జర్నలిస్ట్ ఈ విషయంపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేశారు.ఇలా మహిళా కమిషన్ విచారణకు హాజరు కావాలి అంటూ వేణు స్వామికి నోటీసులు కూడా పంపించారు.అయితే వేణు స్వామి ఈ విచారణకు హాజరుకాకుండా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు.తాజాగా తెలంగాణ హైకోర్టు వేణు స్వామికి బిగ్ షాక్ ఇచ్చింది.వేణు స్వామికి ఇచ్చిన స్టే ఎత్తివేస్తూ తీర్పు వెల్లడించింది.అంతేకాకుండా వారం రోజుల లోపు మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావాలని తెలిపింది.
మరి ఈ వారం రోజులలోగా వేణు స్వామి విచారణకు హాజరు కాకపోతే చర్యలు తప్పవని తెలుస్తోంది.







