తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి.ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం జరుగుతోంది.
ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను( KTR ) టార్గెట్ చేసుకొని కాంగ్రెస్ నేతలంతా వరుసగా విమర్శలు చేస్తున్నారు.ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో పాటు, టాలీవుడ్ హీరోయిన్ల అంశాన్ని తెరపైకి తెచ్చి కేటీఆర్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలో కేటీఆర్ ను ఆధారాలతో సహా అరెస్టు చేసే అవకాశం ఉందన్న ప్రచారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హార్ట్ టాపిక్ గా మారింది.అయితే ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన కేటీఆర్ అరెస్టుల వ్యవహారంపై తాజా గా స్పందించారు.
తాను అరెస్టు( Arrest ) కావడానికి రెడీ అని , పోలీసు అధికారులకు మిత్తితో సహా చెల్లిస్తానని ఆదిలాబాద్ లో కేటీఆర్ ప్రకటించారు.దీంతో కేటీఆర్ నోట అరెస్ట్ మాట రావడం చర్చనీయాంశం గా మారింది.
దీనికి కారణం ఒకటి రెండు రోజుల్లో బాంబులు పేలుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Minister Ponguleti Srinivas Reddy ) సీయోల్ నుంచి ప్రకటించారు.
![Telugu Aicc, Brs Ktr, Congress, Harish Rao, Kcr Farm, Ktr, Pcc, Revanth Reddy-Po Telugu Aicc, Brs Ktr, Congress, Harish Rao, Kcr Farm, Ktr, Pcc, Revanth Reddy-Po](https://telugustop.com/wp-content/uploads/2024/10/will-congress-government-arrest-ktr-detailsa.jpg)
అన్ని ఆధారాలు సిద్ధమయ్యాయని , కక్ష సాధింపులు అనే దానికి అవకాశం లేకుండా తాము చర్యలు తీసుకుంటామని పొంగులేటి ప్రకటించారు.ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పక్కాగా అరెస్టు చేస్తుందనే విషయం కేటీఆర్ కు కూడా సమాచారం ఉందని , అందుకే ముందుగానే ఆగస్టుల గురించి మాట్లాడుతున్నారనే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది .వాస్తవంగా బీఆర్ఎస్ అధికారంలో ఉండగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి పై( Revanth Reddy ) అనేక విషయాల్లో కక్షసాధింపులకు బీఆర్ఎస్ ప్రభుత్వం దిగింది.ఈ విషయం బహిరంగమే.ఇప్పుడు కేటీఆర్ విషయంలో అన్ని ఆధారాలు ఉన్నా అరెస్టు చేయకపోతే , ప్రజల్లో చులకన అవుతామనే అభిప్రాయంతో ఉన్న రేవంత్ రెడ్డి కేటీఆర్ ను అరెస్టు చేసేందుకు అవసరమైన అన్ని ఆధారాలను ముందుగానే సిద్ధం చేశారని ,
![Telugu Aicc, Brs Ktr, Congress, Harish Rao, Kcr Farm, Ktr, Pcc, Revanth Reddy-Po Telugu Aicc, Brs Ktr, Congress, Harish Rao, Kcr Farm, Ktr, Pcc, Revanth Reddy-Po](https://telugustop.com/wp-content/uploads/2024/10/will-congress-government-arrest-ktr-detailsd.jpg)
అయితే అర్ధరాత్రి అరెస్టు కాకుండా కేటీఆర్ ను అరెస్టు చేసేందుకు అన్ని ఆధారాలను సిద్ధం చేసుకుని , వాటిని ప్రజల్లో పెట్టి అప్పుడే అరెస్టు చేసే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.ఇప్పటికే బీఆర్ఎస్ అనేక విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటోంది .ముఖ్యంగా పార్టీకి చెందిన కీలక నేతలు చాలామంది కాంగ్రెస్ లో చేరిపోయారు. పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్న సమయంలో కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారని ప్రచారం బీఆర్ఎస్ ను మరింత ఆందోళనకు గురిచేస్తుంది.ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఫామ్ హౌస్ కే ఎక్కువగా పరిమితం అవుతున్నారు.
యాక్టివ్ గా రాజకీయాల్లో ఉండడం లేదు.కేటీఆర్, హరీష్ వంటి వారే అన్ని వ్యవహారాలను చక్కబెడుతున్నారు.
ఈ క్రమంలో కేటీఆర్ ను అరెస్టు చేస్తే బీఆర్ఎస్ మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే.