జనసేనకు పెరిగిన డిమాండ్ .. ఆ కండిషన్లు పెడుతున్న పవన్ 

ప్రస్తుతం ఏపీలో జనసేన పార్టీ( Janasena party )కి ఆదరణ రోజు రోజు కి పెరుగుతోంది.వైసీపీలోని అసంతృప్త నేతలు,  సరైన ప్రాధాన్యం దక్కక పార్టీ మారే ఆలోచనతో ఉన్న నేతలకు ఇప్పుడు జనసేన ఆప్షన్ గా కనిపిస్తోంది.

 Increased Demand For Jana Sena Pawan Is Putting Those Conditions, Pavan Kalyan-TeluguStop.com

రోజురోజుకు జనసేనకు డిమాండ్ పెరుగుతుండడం,  ఏపీ ప్రభుత్వంలో జనసేన కీలక భాగస్వామ్యంగా ఉండడం,  ప్రజల్లోనూ ఆ పార్టీకి మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో వైసీపీని వీడి వెళ్ళాలనుకున్న నాయకులంతా జనసేన వైపే చూస్తున్నారు.ఈ మేరకు చాలామంది వైసిపి నాయకులు జనసేనలో చేరేందుకు రాయబారాలు పంపిస్తున్నారు.

అయితే చేరికల విషయంలో పవన్ కళ్యా( Pawan Kalyan )ణ్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు.జనసేన గేట్లు తెరిస్తే చాలు పార్టీలో చేరేందుకు సిద్ధం అన్నట్లుగా చాలామంది నాయకులు ఎదురుచూపులు చూస్తున్నారు.

అయితే చేరికల విషయంలో తొందర పడకూడదని,  ఆచితూచి వ్యవహరించాలని , లేకపోతే మొదటికే మోసం వస్తుందనే అభిప్రాయంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు.

Telugu Ap, Janasena, Janasena Cheif, Janasenani, Pavan Kalyan, Tdpbjp, Ys Jagan,

చేరికల విషయంలో అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవడమే కాకుండా, నేతల ట్రాక్ రికార్డులను కూడా తెప్పించుకుని పూర్తిగా పరిశీలించిన తరువాతనే చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారట .ఈ మేరకు పవన్ కళ్యాణ్ కొన్ని మార్గదర్శకాలను పాటిస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.జనసేన చేరాలనుకున్న నాయకులు గతంలో ఏదైనా పెద్ద పదవులు నిర్వహించారా ?  నిర్వహిస్తే ఆ శాఖలో ఏదైనా అవినీతికి పాల్పడ్డారా ?  వాటిలో వాస్తవం ఎంత అనేది కూడా నివేదికలు తెప్పించుకుంటున్నారట.అవినీతి మాత్రమే కాకుండా కేడర్ తో పాటు ప్రజల్లో బలంగా ఉన్న నేతలను మాత్రమే చేర్చుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట.

Telugu Ap, Janasena, Janasena Cheif, Janasenani, Pavan Kalyan, Tdpbjp, Ys Jagan,

పార్టీలో చేరాలనుకున్న నేతల కారణంగా జిల్లా వ్యాప్తంగా పార్టీ బలపడుతుందని నమ్మకం ఉంటే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారట.నియోజకవర్గానికి పరిమితమైన నాయకులైతే మాత్రం వెయిటింగ్ లో పెడుతున్నారట.అంతేకాకుండా జనసేన లో నేత్రలను చేర్చుకుంటే మిత్రపక్షాలైన టిడిపి,  బిజెపి లకు ఇబ్బంది కలగకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

కూటమి పార్టీల మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా నియోజకవర్గ స్థాయిలో మూడు పార్టీల నేతలకు అంగీకారం అయితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారట.ఇప్పటికే చాలామంది నేతలు విషయంలో నియోజకవర్గ స్థాయిలో పార్టీ నేతలు నుంచి అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో వైసీపీలోని కీలక నాయకులకే పవన్ రెడ్ సిగ్నల్ వేశారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube