లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు పనిముట్ల పంపిణీ

రూ.70 వేల విలువగల సామాగ్రి పంపిణి రాజన్న సిరిసిల్ల జిల్లా: నిరుపేదలకు వివిధ రకాల పనిముట్లను అందజేసి ఉదారతను చాటుకున్న లయన్స్ క్లబ్.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం లయన్స్ క్లబ్ అధ్యక్షులు కోట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో రూ.70వేల విలువ గల సామాగ్రి 3 కుట్టు మిషిన్లు నిరుపేద మహిళలకు,4 సైకిల్స్ స్టూడెంట్స్ కు, రెండు క్రిమిసంహారక స్ప్రేయర్ డబ్బాలను నిరుపేద కౌలు రైతులకు, ట్రై సైకిల్ ను నిరుపేద దివ్యాంగురాలుకు అందజేశారు.అదేవిధంగా ఎల్లారెడ్డిపేట మండలంలో నూతన టీచర్లుగా ఎంపికైన పదిమందిని ఘనంగా శాలువ లు కప్పి సన్మానించారు.ఈ సందర్భంగా కోట సతీష్ కుమార్ మాట్లాడుతూ మండలంలో ఎవరైనా నిరుపేదలు ఉన్నట్లయితే వారి స్వయం ఉపాధి కొరకై తన వంతు సహాయం అందిస్తానని ప్రకటించారు.

 Distribution Of Tools To The Poor Under The Auspices Of The Lions Club , Lions C-TeluguStop.com

ఈ కార్యక్రమంలో సెక్రటరీ నాయిని భాస్కర్ రెడ్డి, ట్రెజరర్ రావుల లింగారెడ్డి, లయన్స్ డిస్టిక్ చైర్ పర్సన్ పయ్యావుల రామచంద్రం, ఇతర లయన్స్ క్లబ్ బాధ్యులు ముత్యాల శ్రీనివాస్ రెడ్డి, సద్ది లక్ష్మారెడ్డి, కొలనూరు శంకర్, బోయిని మహాదేవ్, రావుల మల్లారెడ్డి, పార్టీ దేవయ్య, గొర్రె మల్లేష్, పెంజర్ల రవి, డాక్టర్ అమరేందర్ రెడ్డి, రావుల ముత్యం రెడ్డి, వనం ఎల్లయ్య,పెంజర్ల రవి, పల్లి సాంబశివరావు, నాగార్జున రెడ్డి, సాదు వెంకట్ రెడ్డి పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube