మీడియా తోడ్పాటు కూడా లభిస్తే ఇలా మట్టిలో మాణిక్యాలు బయటకు వస్తారు !

సినిమా ఇండస్ట్రీ అంటేనే కమర్షియల్ మార్కెట్.ఇక్కడ ఒక సక్సెస్ కొట్టాలన్న లేదా సినిమా హైప్ క్రియేట్ అవ్వాలన్న మీడియా ప్రధాన పాత్ర పోషిస్తుంది.

 All Media Supports Rocking Rakesh , Rocking Rakesh, Anji , Character Artist , Ke-TeluguStop.com

మరి మీడియా అంటేనే చాలామందికి ఏది పడితే అది రాస్తారు వైరల్ అవ్వడం కోసం ఏదైనా చేస్తారు అని అపోహ ఉంటుంది.కానీ ఏదైనా జెన్యూన్  ప్రయత్నం చేస్తే మీడియా ఎప్పుడు సహకరిస్తుంది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను.

అది నిన్న జరిగిన ఒక సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్.అది మరేదో కాదు రాకింగ్ రాకేష్ అనే ఒక జబర్దస్త్ కమెడియన్( Jabardast comedian ) మెయిన్ లీడ్ గా గరుడవేగ అంజి దర్శకత్వంలో వస్తున్న కేసిఆర్ కేశవ చంద్ర రమావత్ ( Kesava Chandra Ramawat )అనే చిత్రం కి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్.

ఇది చాలా అటహాసంగా ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది.

Telugu Rakesh, Anji, Kesavachandra-Telugu Top Posts

అయితే ఇలాంటి ఒక టైటిల్ తో వస్తున్న సినిమా పై ఎన్నో అపోహలు ఉంటాయి.ఎంత కుదిరితే అంత రాజకీయం చేయాలనే నేపథ్యంలో పార్టీలు ఉంటారు.మీడియా కూడా ఏదో ఒక వర్గానికి సపోర్ట్ చేస్తూ వార్తలు రాస్తూ ఉంటారు.

కానీ ఈ ఈవెంట్ కు వచ్చిన మీడియా మిత్రులు అలాగే అతిధులు సినిమా ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత జరిగిన పరిణామాలను బట్టి చూస్తే రాకింగ్ రాకేష్ ( Rocking Rakesh )ఎంత అద్భుతంగా తన సినిమా కోసం కష్టపడ్డాడు ఇట్టే అర్థమవుతుంది.ప్రతి ఒక్కరు రాకేష్ కి సపోర్ట్ చేసిన తీరు ఎంతో ముచ్చటేసింది.

ఒక సినిమా బయటకు తేవడం అంటే పురిటి నొప్పులు పడ్డ విధంగానే ఈ మధ్యకాలంలో పరిస్థితులు ఉంటున్నాయి.మరి ఎంతో కష్టపడి చాలా సమయం తీసుకొని రాకేష్ ఒక అద్భుతమైన సినిమాను అంజి దర్శకత్వంలో( Anji ) బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.

దానికోసం తానే నిర్మాతగా కూడా మారారు.

Telugu Rakesh, Anji, Kesavachandra-Telugu Top Posts

సినిమా కూడా రాజకీయ కోణంలో కాకుండా డ్రామా, ఎమోషనల్ యాంగిల్ లో బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.మరి ఇలాంటి సినిమాలు బయటకు రావాలంటే మీడియా మిత్రుల సహకారం ఖచ్చితంగా కావాలి.అందుకే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన దాదాపు అన్ని స్రీమ్స్ ఈ సినిమాకి సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇదే విధంగా చిన్న సినిమాలను ఆదరిస్తే రాకేష్, గరుడవేగ అంజి లాంటి వారికి ఖచ్మంఛితంగా మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి.అలాగే అద్భుతమైన సినిమాలు బయటకు వస్తాయి.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ( Character artist )గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సత్య కృష్ణ కూతురు అనన్య నటిస్తుంది.చూడడానికి చాలా అందంగా టెండర్ వాయిస్ తో చూడచక్కగా ఉంది.

ఓవైపు నిర్మాతగా మరోవైపు హీరోగా రాకింగ్ రాకేష్ ప్రయత్నం ఖచ్చితంగా మెచ్చుకోదగినదే.అలాగే ఇలాంటి ఒక నటుడికి, పెర్ఫార్మర్ కి అంజి లాంటి దర్శకుడు వెన్నంటే ఉండడం కూడా చాలా మంచి పరిణామం అని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube