ప్రస్తుతం పుష్ప 2 సినిమా( Pushpa 2 Movie ) మీద భారీ అంచనాలైతే ఉన్నాయి.ఇక డిసెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకి ప్రమోషన్స్ ను కూడా తొందర్లోనే చేపట్టే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
ఇక దానికి అనుగుణంగానే అల్లు అర్జున్( Allu Arjun ) కూడా ఈ ప్రమోషన్స్ లో పాల్గొని భారీ రికార్డులను సృష్టించే విధంగా సినిమా మీద హైప్ తీసుకు రావడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన దేవర సినిమా( Devara ) ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.

దాంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కొంతవరకు డౌన్ అయినట్టుగా కనిపిస్తుంది.మరి ఇలాంటి సమయంలోనే పుష్ప 2 సినిమా వచ్చి భారీ సక్సెస్ ని సాధిస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీ పవర్ ఏంటో మరోసారి మిగతా ఇండస్ట్రీ లకు తెలుస్తుందని సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఈ సంవత్సరం ఎండింగ్ లో వస్తున్న భారీ సినిమా పుష్ప 2 కావడం వల్ల ఈ సినిమా మీద ఇండియా మొత్తం భారీ అంచనాలైతే ఉన్నాయి.

ఇక ఆల్రెడీ పుష్ప సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్ అయింది.కాబట్టి ఆటోమేటిగ్గా పుష్ప 2 సినిమా మీద భారీ అంచనాలైతే పెరుగుతున్నాయి.మరి దానికి అనుగుణంగానే ఆయన ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.
ఇంకా ఇప్పటివరకు రిలీజ్ అయిన గ్లింప్స్ ను కనక చూసినట్లయితే అవన్నీ అద్భుతంగా వచ్చాయి.ఇక రాబోయే ట్రైలర్ ను కూడా అద్భుతంగా మలచబోతున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఏది ఏమైనా కూడా పుష్ప 2 తో అల్లు అర్జున్, సుకుమార్( Sukumar ) ఇద్దరు కలిసి ఒక పెను ప్రభంజాన్నాన్ని సృష్టించడం అనేది ఇప్పుడు అందరిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది…
.







