టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాల్లోనే నటించినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో మీరాచోప్రా( Meera Chopra ) ఒకరు.పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన బంగారం సినిమాతో మీరా చోప్రా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
ఆ తర్వాత తెలుగులో మీరా చోప్రా కొన్ని సినిమాలలో నటించినా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని వివాదాల ద్వారా కూడా మీరా చోప్రా వార్తల్లో నిలిచారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మీరా చోప్రా వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

సౌత్ ఇండియాలో తనకు ఎక్కువ సంఖ్యలో అవకాశాలు వచ్చాయని బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని ఆమె చెప్పుకొచ్చారు.బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా( Priyanka Chopra) నాకు బంధువు అని ఆమె పేర్కొన్నారు.మాది మధ్యతరగతి కుటుంబం అని మీరా చోప్రా చెప్పుకొచ్చారు.
ప్రియాంక చోప్రా సినిమాల్లోకి అడుగు పెట్టడంతో సినిమా రంగంపై ఆసక్తి కలిగిందని తెలిపారు.

2005 సంవత్సరంలో విడుదలైన ఒక సినిమాతో ఎంట్రీ ఇచ్చానని తెలుగు తమిళ భాషల్లో 25 సినిమాలలో యాక్ట్ చేశానని సౌత్ లో యాక్ట్ చేయడం నాకు పెద్దగా ఇష్టం లేదని ఆమె చెప్పుకొచ్చారు.ఈ ఇండస్ట్రీలో నాకు భాష సమస్య ఉందని ఆమె కామెంట్లు చేశారు.బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమయంలో అవకాశాల విషయంలో సవాళ్లను ఎదుర్కొన్నానని ఆమె చెప్పుకొచ్చారు.
ఆఫర్ల కోసం ఎవరిని కలవాలో అర్థం కాలేదని కొందరు అవకాశాలు ఇచ్చినట్టే ఇచ్చి ఫైనల్ గా ఆ పాత్ర కోసం వేరే వాళ్లను ఎంచుకునేవాళ్లని మీరాచోప్రా పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్లు వస్తే మీరా చోప్రా నటిస్తారో లేదో తెలియాల్సి ఉంది.
మీరాచోప్రా చెప్పిన విషయాలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.