బతుకమ్మ, దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలి

రాజన్న ఆలయంలో సమీక్ష సమావేశంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్రాజన్న సిరిసిల్ల జిల్లా :రానున్న బతుకమ్మ, దేవీ నవరాత్రి ఉత్సవాలు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం లో వైభవంగా నిర్వహించాలని, అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు.బతుకమ్మ, దేవీ నవరాత్రుల సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో చేయాల్సిన ఏర్పాట్లపై ఆలయంలోని గెస్ట్ హౌస్ లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయగా, ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు.

 Bathukamma And Devi Navratri Festivals Should Be Celebrated With Grandeur , Dev-TeluguStop.com

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ అధికారులు పక్కా ప్రణాళికతో వేడుకలను ఘనంగా నిర్వహించాలని సూచించారు.ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేయాలని ఈవో వినోద్ రెడ్డిని ఆదేశించారు.

ఇక్కడ ఈ ఈ రాజేష్ ,డి ఈ రఘునందన్, స్థానాచారి అప్పల బీమా శంకర్, ఆలయ పండితులు, నెమలికొండ ఉమేష్, చంద్రగిరి శరత్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube