మన పట్టణాలలో, పల్లెటూర్లలో, ఇలా ఏ ప్రాంతంలో పడితే ఆ ప్రాంతంలో కొంత మంది విచ్చలవిడిగా చెత్తను పడేస్తూ ఉంటారు.మున్సిపల్ సిబ్బంది చెత్త సేకరణ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్న సరే కానీ కొంతమంది మాత్రం రోడ్లపై చెత్త పడేస్తూ ఉంటారు.
ఈ క్రమంలో కొన్ని ప్రాంతాలలో ప్రతి రోజు కూడా చెత్తను సేకరించడానికి మున్సిపల్ సిబ్బంది వారు వాహనాలను కూడా ఏర్పాటు చేశారు.అయితే కొంత మంది మాత్రం అవి ఏమీ పట్టించుకోకుండా.
రోడ్లపై బహిరంగ ప్రదేశాలలో చెత్తను పడవేస్తూ ఉంటారు.అయితే.
, తాజాగా ఒక ప్రైవేటు ఉద్యోగి చేసిన పనికి మున్సిపల్ సిబ్బంది వినుత్త రీతిలో అతన్ని సన్మానం చేశారు.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.యాదాద్రి జిల్లా చౌటుప్పల్ పట్టణం( Choutuppal )లో ‘స్వచ్ఛతా హీ సేవా( Swachhata Hi Seva )’ కార్యక్రమంలో జాతీయ రహదారి పక్కన మున్సిపల్ సిబ్బంది వారు చెత్తను తొలగించే కార్యక్రమం చేపట్టారు.ఈ తరుణంలో పట్టణ శివారు ప్రాంతంలో ఒక పరిశ్రమలో పని చేస్తున్న ఉద్యోగి ద్విచక్ర వాహనంపై చౌటుప్పల్ నుండి కంపెనీకి వెళ్తున్న మార్గమధ్యంలో ఇంట్లో నుంచి ప్లాస్టిక్ కవర్లో చెత్తను తీసుకొని వచ్చి జాతీయ రహదారి వెంట పడేశాడు.
ఇది గమనించిన అక్కడి మునిసిపల్ పర్యావరణ ఇంజనీర్ రేణు కుమార్ , మున్సిపల్ సిబ్బంది వెంటనే ఆ ఉద్యోగిని అడ్డుకొని, ఇలాంటి ఘటనలు జరుగుతాయనే ముందుగానే ఊహించి మున్సిపల్ అధికారులు మూడు పూల దండలు కొనుక్కొని వెంట తెచ్చుకున్నారు.
అందులో నుంచి ఒక దండం తీసి చెత్త వేసిన సదరు వ్యక్తికి వేసి సన్మానించారు.ఇంట్లో వచ్చే చెత్తను మున్సిపాలిటీ చెత్త సేకరణ వాహనాలకు ఇవ్వాలని.ఇలా బహిరంగంగా పడేయకూడదని మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది తెలిపారు.
ఇక ఆ ఉద్యోగి తన తప్పును అంగీకరించడంతోపాటు.మరోసారి ఇలా చేయనని.
మళ్లీ ఎక్కడ కూడా చెత్త వేయనంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.అంతేకాకుండా మున్సిపల్ సిబ్బంది వారు ఆ ఉద్యోగితో మునిసిపాలిటీ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆటోలోనే చెత్త వేస్తా అని ప్రతిజ్ఞ కూడా చేయించారు.
ఇది చూసిన నెటిజన్స్ కామెంట్స్ తో వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు.