కేటీఆర్ : చంద్రబాబుపై పొగడ్తలు .. ఆయన శిష్యుడు పై విమర్శలు 

టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబును( AP CM Chandrababu ) పొగుడుతూనే ఆయన శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై సెటైర్లు వేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.  గతంలో చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చిన కేటీఆర్ ఏపీలో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు పెంచి అమలు చేయడం పై తాజాగా కేటీఆర్ స్పందించారు .

 Ktr Compliments On Chandrababu Criticisms On Cm Revanth Reddy, Ktr, Kcr, Re-TeluguStop.com

ఈ విషయంలో చంద్రబాబును ప్రశంసించారు.పెన్షన్ పెంపు పై ఏపీ సీఎం మాట నిలబెట్టుకున్నారని కేటీఆర్ అన్నారు .ముఖ్యమంత్రి అయిన వారంలోనే ఏపీలో వృద్ధులకు చంద్రబాబు పెన్షన్ పెంచారని ప్రశంసించారు.  కానీ ఈ పెన్షన్ పెంపు విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) మాట తప్పారని కేటీఆర్ విమర్శించారు.

Telugu Ap, Ap Schemes, Revanth Reddy, Ts-Politics

 తెలంగాణలో చిట్టి నాయుడు సోదరుల కంపెనీ నడుస్తోందని సెటైర్లు వేశారు.  రైతుబంధు భరోసా కాదు , సీఎం కుర్చీకే భరోసా లేదని అన్నారు.హైదరాబాదులో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసిందని, అన్ని సీట్లు గెలిచిందని , అందుకే రేవంత్ రెడ్డి నగర ప్రజలపై కక్షగట్టారని , పేదల ఇళ్లు కూలగోడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.సెటిల్మెంట్లు జరిగే మాదాపూర్ లోని తిరుపతిరెడ్డి ఇంటిని ఎందుకు కూల్చడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు.

  తిరుపతిరెడ్డికి ఒక న్యాయం పేదవాళ్ళకి ఒక న్యాయమా అని ప్రశ్నించారు.కోర్టులు పనిచేయని శనివారం,  ఆదివారం వచ్చి కూల్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు .హీరో నాగార్జున కన్వెన్షన్ ను కూల్చివేశారని,  దానికి అనుమతించింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు .

Telugu Ap, Ap Schemes, Revanth Reddy, Ts-Politics

 అనుమతులు ఇచ్చిన అధికారులను ఎందుకు శిక్షించడం లేదని కేటీఆర్( KTR ) ప్రశ్నించారు.పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ ను ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు .మంత్రుల ఫామ్ హౌస్ లు ఎందుకు ముట్టుకోవడం లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘హైడ్రా ‘ పేరుతో పేదల ఇళ్లను పోల్చుతుండడంపై కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube