బిగ్ బాస్ సీజన్ 8 పై ప్రేక్షకుల్లో తీవ్ర నిరాశ... ఇక ఇలాగే కొనసాగితే కష్టమే!

బిగ్ బాస్ సీజన్ 8( Bigg Boss Season 8 ) ఎంత మంది చూస్తున్నారు… చూసినవాళ్లు ఏమని తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు .? అసలు రోజురోజుకు దిగజారుతున్న ఈ షో పట్ల ఒక్కొక్కరికి ఒక్క అభిప్రాయం ఉంటుంది.ఎందుకంటే మొదటి సీజన్ జూనియర్ ఎన్టీఆర్ తో ప్రారంభమైనప్పుడు యావత్ రెండు తెలుగు రాష్ట్రాలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నాయి.ఆ తర్వాత నాని కూడా పరవాలేదు అనిపించాడు.

 People Are Not Interested In Bigg Boss Season 8 , Bigg Boss Season 8 , Nagarjuna-TeluguStop.com

కానీ నాగార్జున( Nagarjuna ) వచ్చిన తర్వాత నుంచి ఒక్కో సీజన్ దాని ఆసక్తిని తగ్గిస్తూ ప్రేక్షకులలో పూర్తిగా నిరాశ ను మిగిలిస్తుంది.ఖచ్చితంగా ఇది అందరూ ఫీల్ అవుతున్నారు.

ఎందుకంటే ఒకప్పుడు బిగ్బాస్ చూడాలని ఆసక్తి చాలా మందిలో ఉండేది.అలా కంటెస్టెంట్స్ అద్భుతంగా ఆడేవారు.

వారికి పెట్టే గేమ్స్ కానీ, తీసుకొచ్చే కంటెస్టెంట్స్ యొక్క పేరు ప్రఖ్యాతలు గాని అందరిని ఆ షో చూడటానికి ఎంకరేజ్ చేసే విధంగా ఉండేవి.

Telugu Bebakka, Big Boss, Nagarjuna, Shekhar Basha-Telugu Top Posts

ఇప్పుడు ఆ పరిస్థితి లేదు వచ్చిన ఆ 15 మంది ఎవరో కూడా ప్రేక్షకులకు అర్థం కావడం లేదు.ఒకరిద్దరూ తన తప్ప సినిమా సంబంధించిన వారు ఎవ్వరు షోకి రావడానికి ఆసక్తి చూపడం లేదు.పైగా వచ్చిన వారిని కొన్నాళ్లపాటు గమనించిన తర్వాత అయినా అభిమానిస్తారు అనుకుంటే ఎవరికి నచ్చినట్టుగా వారు పిచ్చిపిచ్చిగా ఆడుతూ షోపై పూర్తిగా నిరాశను కలిగిస్తున్నారు.

ఆడియన్స్ ఈ షో పట్ల పూర్తిగా నిరుత్సాహంగానే ఉన్నారు.ఇది ఒక్కరి మాటే కాదు చాలామంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయం అని చెప్పొచ్చు.ఫుడ్ సంపాదించుకోవడానికి ఆడుకోవాలి ఆడిన దాన్ని దొంగలించాలి.ఇలా పిచ్చిపిచ్చి గేమ్స్ పెట్టి ఎలాంటి టిఆర్పి రేటింగ్ కూడా పెంచుకోలేక పోతుంది బిగ్ బాస్ మేనేజ్మెంట్.

Telugu Bebakka, Big Boss, Nagarjuna, Shekhar Basha-Telugu Top Posts

ఇది ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా మరో సీజన్ కి ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి.ఇంతకు ముందు సీజన్స్ లో పాల్గొన్న వారు కూడా ప్రస్తుతం నడుస్తున్న ఎనిమిదవ సీజన్ పట్ల పెదవి విరుస్తున్నారు.తీసుకొచ్చే కంటెస్టెంట్స్ ఎలా ఉన్నా పర్వాలేదు కానీ వచ్చిన తర్వాత వారు గేమ్స్ స్ట్రాటజీ బాగోలేకపోతే ఇంకా చూసే ప్రేక్షకుల్లో ఎలా ఉత్సాహం కలుగుతుంది.అలాగే ఒకరిద్దరు అలా ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు.

పూర్తిగా ఈసారి ఎనిమిదవ సీజన్లో మాత్రం అందరు అలాగే ఉన్నారు.ఒక్కరు కూడా బాగా ఆడటంలేదు.

ఆడుతున్న బెబక్క బిగ్ బాస్ హౌస్ నుంచి మొదటి వారమే ఎలిమినేట్ అయిపోయింది.ఇక శేఖర్ భాష లాంటి వ్యక్తి జోకులు వేస్తున్నాడు అన్న పేరుతో నామినేట్ చేశారు.

ఆ మాత్రం జోక్స్ కూడా లేకపోతే ఎలా ? ఏదైనా ఆలోచన చేసి ఆ తర్వాత వారి నామినేషన్ చేసే విధానం కానీ గేమ్స్ పై పెట్టే దృష్టి కానీ మారిస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube