ఈరోజుల్లో యువతులు తనకంటే చాలా పెద్ద వయసున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడం సాధారణం అయిపోయింది.ఇంతకుముందు ఇండియాలో ముసలి వాళ్లకిచ్చి అమ్మాయిల గొంతు కోసేవారు.
అందుకే వృద్ధులు తమకంటే చాలా తక్కువ వయసు అమ్మాయిలను పెళ్లి చేసుకోవడాన్ని ప్రజలు ఇప్పటికీ చూడలేకపోతున్నారు.ఇండియాలోనే కాదు మిగతా ప్రాంతాల్లో కూడా ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉన్నారు ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఏం విమర్శలు చేస్తున్నారు అంతేకాదు అవమానిస్తున్నారు కూడా.
అలాంటి అవమానాలను 29 ఏళ్ల మహిళ ఫేస్ చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే రియాలిన్ సోలెరో అనే యువతి 24 ఏళ్ల పెద్ద వయసున్న రెనల్డో మెక్‌క్వీన్( Renaldo McQueen ) అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా చర్చనీయాంశంగా మారింది.రియాలిన్ సోలెరోకు 29 ఏళ్లు.
ఆమె తన కంటే 24 ఏళ్ల పెద్దవాడైనా 53 ఏళ్ల రెనల్డో మెక్‌క్వీన్‌తో ప్రేమలో పడ్డారు.తాను ఇంత పెద్ద వయసున్న వ్యక్తిని ఎప్పుడూ ప్రేమించాలని అనుకోలేదని ఆమె చెప్పారు.
కానీ ఏదోలా రెనల్డోపై తనకు ప్రేమ ఉందని గ్రహించారట.ఆమె కుటుంబం ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ, రియాలిన్ తన నిర్ణయం మార్చుకోవడం లేదు.

రియాలిన్ సోలెరో( Realyn Solero ) తనకంటే చాలా పెద్ద వయసున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు చాలామంది ఆమెను తిట్టి, అవమానిస్తున్నారు.ఆమె డబ్బు కోసమో లేదా సౌకర్యవంతమైన జీవితం కోసమో ఆ పెళ్లి చేసుకుందని సూటిపోటీ మాటలు మాట్లాడుతున్నారు.తన తండ్రి వయసున్న వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంది అని ఆమె వివాహం గురించి చాలామంది ప్రశ్నిస్తున్నారు.ఇలాంటి చెడు మాటలు చాలా వచ్చినప్పటికీ, రియాలిన్ సోలెరో పట్టించుకోకుండా, తను ఆయనను డబ్బు కోసం పెళ్లి చేసుకోలేదని చెప్పింది.
తన భర్త చాలా మంచి మనసు గలవాడు అని, తామిరిద్దరి మధ్య చాలా బలమైన బంధం ఉందని ఆ యువతి చెబుతున్నారు.వాళ్లు ఒకరినొకరు ఎప్పుడూ అర్థం చేసుకుంటారు, ఒకరికొకరు సహాయం చేసుకుంటారు.
రెనల్డోతో ఉంటే తనకు చాలా సంతోషంగా ఉంటుందని ఆమె చెప్పారు.రెనల్డో జీవితంలో భాగమవ్వడం తనకు చాలా అదృష్టంగా అనిపిస్తుందని పేర్కొన్నారు.
ప్రేమకు ఏదీ అడ్డురాదంటూ మరి కొంతమంది ఈ జంటకు సపోర్ట్‌గా కామెంట్లు చేస్తున్నారు.







