తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న నటుడు నాని…( Nani ) ఇక ఇప్పటికే ఆయన ‘సరిపోదా శనివారం ‘( Saripodhaa Sanivaaram ) సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.ఈ సినిమాతో మాస్ యాంగిల్ ని ట్రై చేసిన నాని కొంతవరకు సక్సెస్ అయ్యాడు.
ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా హిట్ 3( Hit 3 ) సినిమాకు సంబంధించిన ఒకటి వీడియో ను కూడా రిలీజ్ చేశారు.అయితే ఈ వీడియో లో నాని తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది.

అలాగే ఒక కొత్త కేసు కోసం తను ముందడుగు వేస్తున్నట్టుగా తెలుస్తుంది.హిట్ సినిమా రెండు పార్టులుగా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.ఇక ఈ రెండు పార్టులకు నాని నే ప్రొడ్యూసర్ కావడం విశేషం…ఇక దాంతో ఇప్పుడు నాని నే రంగంలోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక శైలేష్ కోలన్( Sailesh Kolanu ) డైరెక్షన్ లో తెరకెక్కిన హిట్ రెండు పార్ట్స్ కూడా సూపర్ సక్సెస్ ని అందుకున్నాయి.
మధ్యలో వెంకటేష్ తో సైంధవ్ అనే సినిమా చేసిన శైలేష్ ఆ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ సాధించకపోవడంతో ఇప్పుడు హిట్ 3 సినిమా మీదనే మళ్లీ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది.

ఇక ఎలాగైనా నానితో ఈ సినిమాని చేసి సూపర్ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ సక్సెస్ సాధిస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇప్పటికే నాని వరుసగా మూడు సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు.
ఇక ఈ సినిమాతో కనక సక్సెస్ ని అందుకుంటే వరుసగా నాలుగో సక్సెస్ ను కూడా అందుకొని చాలా మంచి గుర్తింపును సంపాదించుకుంటాడు…
.







