సినిమా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవ్వాలంటే అందరి సహకారం ఉండాలి. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, నిర్మాతలు అందరూ ఒకే అండర్‌స్టాండింగ్‌తో కలిసి పని చేయాలి.
మూవీ యూనిట్‌లో ఏ ఒక్కరు తప్పు చేసినా సినిమా చండాలంగా తయారవుతుంది.దీనివల్ల నిర్మాతే చాలా నష్టపోతారు.
టెక్నీషియన్లతో అభిప్రాయ భేదాలు వస్తే వారు వెంటనే తప్పుకుంటారు.వారి ప్లేస్‌లో వేరే వాళ్ళని వెతికి తీసుకురావాల్సిన బాధ్యత నిర్మాతదే.
మామూలు టెక్నీషియన్ వెళ్ళిపోతేనే చాలా కష్టం.అలాంటిది ఇక సినిమాలోని అత్యంత కీలకమైన హీరో, హీరోయిన్ మూవీ నుంచి తప్పుకుంటే నిర్మాత నెత్తిన గుడ్డ పడినట్లే అవుతుంది.
దర్శకులు, నిర్మాతలకు ఇలాంటి భారీ షాక్‌లు తగలడం కొత్తేం కాదు.చాలామంది నటీనటులు మధ్యలో హ్యాండ్ ఇవ్వడం వల్ల కొన్ని సినిమాలు ఆగిపోయాయి కూడా.
అయితే ఏ దర్శకనిర్మాతలు ఎదుర్కోని ఒక విచిత్రమైన పరిస్థితిని దర్శకుడు సాగర్ ఎదుర్కొన్నారు.ఆ విచిత్రమైన పరిస్థితి ఏంటో తెలుసుకుందాం.
దర్శకుడు సాగర్( Director Sagar ) 1995 ప్రాంతంలో సూపర్‌స్టార్ కృష్ణ హీరోగా పెట్టి ‘భారత సింహం’ అనే సినిమాను స్టార్ట్ చేశారు.ఆపై హీరోయిన్ కోసం వెతకడం ప్రారంభించారు.అప్పటికే సాగర్ సౌందర్య, ఆమని( Soundarya, Amani ) వంటి హీరోయిన్లతో సూపర్‌హిట్ సినిమాలు తీశారు.షూటింగ్ సమయంలో వాళ్లే బాగా సపోర్ట్ చేస్తారని, వారిలో ఒకరిని ఎంపిక చేసుకుందామని చెప్పారు సాగర్.
కానీ, నిర్మాత ముంబై బేస్డ్ హీరోయిన్‌ను తీసుకుందామని పట్టుబట్టారు.ఇక చేసేదేమీ లేక ఈ మూవీలో నగ్మాను హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు.
వాస్తవానికి నగ్మా అప్పటికే 20 తెలుగు సినిమాల్లో చేసి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.
అయితే నగ్మా( Nagma) ఎస్టాబ్లిషిడ్ హీరోయిన్ కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదని దర్శక నిర్మాతలు అనుకున్నారు కానీ మొదటి షూటింగ్ రోజు నుంచే ఆమె వారిద్దరికీ చుక్కలు చూపించిందట.ముఖ్యంగా కాస్ట్యూమ్స్ విషయంలో నగ్మా చాలా డిమాండ్స్ వినిపించేదట.ఒకానొక రోజు తన కోసం కాస్ట్యూమ్స్‌ని కుట్టించాలని డిమాండ్ చేసిందట.
అయితే “ఆమె కోసం ప్రత్యేకంగా బట్టలు కుట్టించడం దేనికి, నచ్చిన డ్రెస్‌ను ఆమెనే తెచ్చుకోమనండి, దానికి మనమే బిల్లు కడదాం” అని సాగర్ నిర్మాతతో చెప్పాడట.నిర్మాత అదే సంగతి చెప్పడంతో నగ్మా ఓ టూ-పీస్ డ్రస్ తీసుకొచ్చింది.
అదే తన కాస్టూమ్ అని చెప్పింది.దాని బిల్లు రూ.60 వేలు అని కూడా తెలిపింది.దాంతో నిర్మాత షాక్ అయ్యాడు.
ఆ బిల్లు ఇచ్చేది లేదంటూ కుండబద్దలు కొట్టాడు.నగ్మా మాత్రం ఆ డబ్బులు ఇవ్వాల్సిందే అని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది.దాంతో దర్శకుడు సాగర్ రూ.60 వేలు తానే ఇస్తానంటూ సాగర్ నగ్మాకు చెప్పాడు.కానీ అందుకు నగ్మా ఒప్పుకోలేదు.ప్రొడ్యూసర్ ఇస్తేనే తీసుకుంటాను అంటూ గొడవ చేసింది.సాగర్ ఆమె పెడుతున్న టార్చర్ ను భరించలేక చివరికి బరస్ట్ అయ్యాడు.తన నోటికి వచ్చినట్లుగా బండబూతులు తిట్టాడు.
దాంతో తీవ్ర కోపానికి లోనైనా నగ్మా ఆ సినిమా చేయానంటే చేయను అంటూ హాయిగా ముంబైకి వెళ్ళిపోయింది.అప్పటికి ఆమెతో తీయాల్సిన సీన్లు చాలానే ఉన్నాయి.
అందువల్ల నగ్మాను తిరిగి షూటింగులకు తీసుకురావడానికి సూపర్ స్టార్ కృష్ణ, భరద్వాజ ఎంతో ట్రై చేశారు.కానీ నగ్మా మాత్రం కొంచెం కూడా జాలి చూపించలేదు.
ఆమె రాకపోవడంతో సినిమాను ఎలాగోలా అడ్జస్ట్ చేసి పూర్తి చేశారు.అయితే మూవీ హీరోయిన్ పాత్ర సరిగా లేక దారుణంగా తయారయింది.
అందువల్ల ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.అలా ఒక హీరోయిన్ వల్ల ఈ సినిమా నిర్మాత దారుణంగా నష్టపోయారు.