బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలు.. ఎన్టీఆర్ కి ఆహ్వానం అందకపోవడానికి బాలయ్య కారణం కాదా?

నందమూరి నటసింహం బాలయ్య బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలయ్య బాబు( Balayya Babu ) ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Ntr Family Key Decision On Nbk 50 Years Celebrations Details, Ntr, Jr Ntr, Balak-TeluguStop.com

ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు.ఇది ఇలా ఉంటే త్వరలోనే బాలయ్య బాబు స్వర్ణోత్సవ వేడుకలు జరగనున్న విషయం తెలిసిందే.

నేను సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ వేడుకలను జరగనున్నాయి.బాలకృష్ణ 50 సంవత్సరాల సినీ వేడుకను పురస్కరించుకొని సినీ పరిశ్రమ పెద్దలు సెప్టెంబర్ 1వ తేదీన బాలయ్య గోల్డెన్ జూబ్లీ వేడుకలను( Balayya Golden Jubilee Celebrations ) ఘనంగా నిర్వహిస్తున్నారు.

Telugu Balakrishna, Balayyagolden, Jr Ntr, Kalyan Ram, Nandamuri, Nbk, Tollywood

ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినీరంగ, రాజకీయ ప్రముఖులందరూ, సీఎంలు కూడా రాబోతున్నారు.నందమూరి కుటుంబం చాలా పెద్దది.సీనియర్ ఎన్టీఆర్ పిల్లలు, వారి కుటుంబాలు, అటు వాళ్ళు ఇటు వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు.అందుకే బాలకృష్ణ 50 ఏళ్ల ఫంక్షన్ కు వారందరినీ పిలిచే బాధ్యతను నందమూరి రామకృష్ణ కు( Nandamuri Ramakrishna ) అప్పగించారట.

ఎందుకంటే ఆయనకు అందరితో మంచి సంబంధం ఉంటుందట.ముఖ్యంగా హరికృష్ణ పిల్లలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లను పిలిచే బాధ్యతను కూడా నందమూరి రామకృష్ణకే అప్పగించారని సమాచారం అందుతోంది.

అందువల్ల ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫంక్షన్ కు వస్తారా లేదా ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ప్రస్తుతానికి వారికి తెలియదని, అదంతా రామకృష్ణనే చూసుకుంటారని చెబుతున్నారు సీనియర్ ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు.

Telugu Balakrishna, Balayyagolden, Jr Ntr, Kalyan Ram, Nandamuri, Nbk, Tollywood

అయితే గతంలో సీనియర్ ఎన్టీఆర్ శత జయంతికి సిటీలో లేకపోవడం వల్ల రాలేదని మరి ఈసారి వారి షూటింగ్ టైమింగ్స్ ఏమిటో తమకు తెలియదని చెప్పారు.అదంతా రామకృష్ణ చూసుకుంటారన్నారు.నందమూరి కుటుంబమంతా బాలయ్య ఇంటికి చేరి అక్కడి నుంచి సభా ప్రాంగణానికి ఒక బస్సులో వచ్చేలా ప్లానింగ్ ఉందట.

మరి ఎన్టీఆర్ కి( NTR ) ఆహ్వానం అందిందా లేదా ఎన్టీఆర్ ఈ వేడుకలకు హాజరవుతారా లేదా ఈ విషయాలపై క్లారిటీ రావాలంటే వేచి చూడాల్సిందే మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube