వైరల్ వీడియో: అప్పటివరకు డాన్స్ చేసిన కానిస్టేబుల్.. ఒక్కసారిగా..?

తరచుగా మనం ఇటీవల కాలంలో ఎక్కువగా గుండెపోటుతో మృతి చెందిన సంఘటనలు చాలానే చూసాం.ఈ క్రమంలో ఉన్నటు ఉండి ఒక్కసారిగా చాతిలో నొప్పి రావడం, అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతి చెందిన సంఘటనలు చాలానే ఉన్నాయి.

 The Constable Who Danced Till Then In The Viral Video Suddenly, Heart Attack , H-TeluguStop.com

అచ్చం అలాగే తాజాగా ఒక హెడ్ కానిస్టేబుల్ డాన్స్( Head Constable Dance ) చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతి చెందిన సంఘటన ఢిల్లీ నగరంలో చోటుచేసుకుంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

ఢిల్లీ రూప్‌ నగర్‌( Delhi Roop Nagar ) పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న రవికుమార్ ( Ravikumar )బదిలీ అవ్వడంతో అక్కడి వారు అందరూ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా.రవికుమార్ పలు పాటలకు ఉత్సాహంగా డాన్స్ చేసేందుకు ముందుకు వచ్చాడు.ఈ క్రమంలో అతనికి ఒకసారిగా చాతిలో నొప్పి రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.వెంటనే రవికుమార్ ను అక్కడి సహచరులు స్థానిక ఆసుపత్రికి తరలించగా.అప్పటికే రవికుమార్ చనిపోయినట్లు డాక్టర్స్ తెలియజేశారు.

అప్పటివరకు స్నేహితులతో సరదాగా గడిపిన కానిస్టేబుల్ ఒక్కసారిగా ఇలా మృతి చెందడంతో అతని స్నేహితులు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.

ప్రస్తుతం కానిస్టేబుల్ చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.2010లో ఢిల్లీ పోలీస్ విభాగంలో ఉత్తర్‌ప్రదేశ్‌ లోని బాగ్‌పత్‌ చెందిన రవికుమార్ చేరినట్లు సమాచారం.అయితే 45 రోజుల క్రితమే ఆహెడ్ కానిస్టేబుల్ రవికుమార్ గుండె పనితీరును తెలియజేసే యాంజియోగ్రఫీ పరీక్ష చేయించుకున్నట్లు సమాచారం.

ఏది ఏమైనా కానీ.వయసుతో సంబంధం లేకుండా ఇలా గుండెపోట్లు రావడం చాలామందికి భయాందోళనలకు గురిచేస్తుంది.

ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube