ఇటీవల కాలంలో ఒక సూపర్ హిట్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిందంటే ఆ సినిమాకు సీక్వెల్ చిత్రం కచ్చితంగా వస్తున్న సంగతి మనకు తెలిసిందే.ప్రస్తుతం ఇండస్ట్రీలో సీక్వెల్స్ సినిమాల పరంపర కొనసాగుతోంది.
ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు సీక్వెల్ షూటింగ్ పనులలో బిజీగా ఉన్నాయి.అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) హీరోగా నటించిన సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ సినిమాలకు సీక్వెల్ సినిమాలు రాబోతున్నాయి అంటూ వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వినీ దత్ ( Aswini Datt ) వెల్లడించారు.
అశ్వినీ దత్ చిరంజీవి కాంబినేషన్లో పలు సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.అయితే ఇటీవల వీరి కాంబినేషన్లో వచ్చిన ఇంద్ర ( Indra ) సినిమా తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
రీ రిలీజ్ లో కూడా ఈ సినిమా ఎంతో అద్భుతమైన కలెక్షన్లను రాబట్టడంతో చిత్ర బృందాన్ని చిరంజీవి ఘనంగా సత్కరించారు.అయితే తాజాగా అశ్విని దత్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ చిరంజీవి హీరోగా తమ బ్యానర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇంద్ర, జగదేకవీరుడు అతిలోకసుందరి ( Jagadeka Veerudu Athiloka Sundari ) సినిమాలకు త్వరలోనే సీక్వెల్స్ రాబోతున్నాయని ప్రకటించారు.
చిరంజీవి కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలలో ఈ రెండు సినిమాలు కూడా ఉంటాయి.శ్రీదేవి చిరంజీవి హీరో హీరోయిన్లుగా నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా ఎవర్గ్రీన్ మూవీ అని చెప్పాలి.అయితే అశ్వినీ దత్ మాట్లాడుతూ త్వరలోనే ఈ సినిమాలకు సీక్వెల్ సినిమాలను ప్లాన్ చేస్తున్నామని తెలియజేయడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా విషయంలో గతంలో చిరంజీవి చేసిన కామెంట్స్ కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమా సీక్వెల్ చిత్రంలో తన కుమారుడు రామ్ చరణ్( Ramcharan ) శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ( Janhvi Kapoor ) ఇద్దరు కలిసి నటిస్తే చూడాలని ఉంది అంటూ ఆయన తన మనసులో కోరికను బయటపెట్టారు.అయితే ఈ కాంబినేషన్లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో జగదేకవీరుడు అతిలోకసుందరి రాబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి.అయితే ఈ సినిమాలకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.