చిరంజీవి యాక్షన్, రొమాంటిక్, సెంటిమెంటల్ సినిమాలు మాత్రమే కాదు కామెడీ సినిమాలు కూడా చాలా చేశాడు.అందులో “చంటబ్బాయి (1986)( Chantabbai )” సినిమా ఒకటి.
దీనికి జంధ్యాల దర్శకుడు.ఇదొక ఇన్వెస్టిగేషన్-కామెడీ డ్రామా ఫిల్మ్.
మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన అదే పేరుతో ఉన్న నవల ఆధారంగా తీసిన ఈ సినిమా చాలామందిని బాగా ఆకట్టుకుంది.చిరంజీవి పుట్టినరోజు నాడే రిలీజ్ అయినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఎత్తున కలెక్షన్లను వసూలు చేసింది.
ఫుల్ లెన్త్ ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రలో చిరంజీవి( Chiranjeevi ) అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఎంతగానో నవ్వించాడు.అయితే సేమ్ ఇలాంటి జానర్‌లో ఒక సినిమా తీద్దామని హీరో నాని, దర్శకుడు నాగ్ అశ్విన్( Nag Ashwin ) ప్లాన్ చేశారు.
వాళ్ళిద్దరూ కలిసి “ఎవడే సుబ్రహ్మణ్యం” సినిమా చేసిన సంగతి తెలిసిందే.ఈ మూవీ షూటింగ్ సమయంలోనే కామెడీ డిటెక్టివ్ డ్రామా ఫిల్మ్ చేయాలని భావించారు.అయితే వాళ్లు ఈ సినిమాని మొదలు పెట్టాలనుకునే లోపే ఇలాంటి మూవీ తెలుగులో ఒకటి వచ్చింది.అదే “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ (2019)( Agent Sai Srinivasa Athreya )”.
స్వరూప్ R.S.J డైరెక్ట్ చేసిన ఈ కామెడీ మిస్టరీ మూవీలో నవీన్ పొలిశెట్టి టైటిల్ క్యారెక్టర్‌లో టెరిఫిక్ పర్ఫామెన్స్ కనబరిచాడు.ఇందులో క్యూట్ బ్యూటీ శృతి శర్మ నటించింది.
కథ విషయానికి వస్తే ఇందులో నెల్లూరుకు చెందిన ఓ డిటెక్టివ్ రైల్వే ట్రాక్ దగ్గర పడిపోయిన మృతదేహం కేసును దర్యాప్తు చేస్తుంటాడు.అయితే ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు అతని ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది.
ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో వచ్చిన ఈ సినిమా రూ.20 కోట్లు కలెక్ట్ చేసి భారీ హిట్ సాధించింది.దీన్ని కేవలం రూ.4 కోట్ల బడ్జెట్ తోనే తెరకెక్కించారు.చిరంజీవి తర్వాత మళ్లీ ఆ తరహా సినిమా తీసి నవీన్ పొలిశెట్టి మంచి హిట్ కొట్టగలిగాడు.సినిమాని వీళ్లు చాలా పర్ఫెక్ట్ గా తీశారు.మళ్లీ అలాంటి సినిమా తీసి రొటీన్ ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగించకూడదని హీరో నాని అనుకున్నాడు.స్టోరీలో బలం లేక అంచనాలను అందుకోకపోతే ఫ్లాప్ అయ్యే అవకాశం ఉందని నాగ్ అశ్విన్ భయపడ్డాడు.
అందుకే వాళ్ళు ఈ మూవీ చేయకూడదని తమ ఆలోచనను పక్కన పెట్టేశారు.