దీన్ని సినిమా అంటారా.. మళ్లీ అల్లు అర్జున్, సుకుమార్‌లతో ప్రమోషన్సూ.. టూ మచ్ కాలేదా?

రావుగోపాలరావు చాలా గొప్ప కేరక్టర్ ఆర్టిస్టు అని చెప్పుకోవచ్చు.ఆయన వారసుడిగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రావు రమేష్( Rao Ramesh ) అద్భుత నటనతో తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నాడు.

 What Happened To Rao Ramesh Details, Maruthi Nagar Subramanyam, Rao Ramesh, Allu-TeluguStop.com

ఏ ఎమోషన్స్ అయినా చాలా ఈజీగా పలికించగల నటుడితడు.నటనలో వంక పెట్టడానికి లేదు కానీ ఈ యాక్టర్ తన వ్యవహార ధోరణితో నిర్మాతలకు చిరాకు పుట్టిస్తున్నాడని అంటున్నారు.

సొంత పాత్రల పట్ల చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నాడట.తెలుగు ఇండస్ట్రీలో తనకు దక్కాల్సిన ప్రాధాన్యం దక్కడం లేదని చాలా ఫీల్ అయిపోతున్నట్లుగా సినీ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది.

నిజానికి అనేక ఆంక్షలు, కమర్షియల్ షరతులు పెట్టే హిందీ కేరక్టర్ ఆర్టిస్టుల కంటే రావు రమేష్ చాలా నయం.

ఇలాంటి సమయంలో రావు రమేష్ కు ఓ మంచి, ఫుల్ లెంత్ కేరక్టర్ దొరికింది.అదేనండి “మారుతీ నగర్ సుబ్రమణ్యం”( Maruthi Nagar Subramanyam ) మూవీలో! డైరెక్టర్ సుకుమార్ భార్య సమర్పించిన ఈ సినిమాలో ఇంద్రజ, అన్నపూర్ణమ్మ లాంటి ప్రముఖ నటీమణులు కూడా నటించారు.బన్నీ ప్రిరిలీజ్‌ ఈవెంట్‌కొచ్చి దీని హైప్ పెంచేసాడు.

దీనికి భారీ ఎత్తున ప్రచారం వచ్చినా ఇది చాలా చిన్న సినిమా.ఇదే స్టోరీతో కొత్త నటులు సినిమా తీసినట్లైతే ఒక్కరు కూడా పట్టించుకునే వారు కాదు.

Telugu Allu Arjun, Annapoornamma, Indraja, Maruthinagar, Rao Ramesh, Sukumar, To

ప్రిరిలీజుకు ముందే థియేటర్లు, బయ్యర్లు, మీడియా వంటి వారిని ఇన్‌ఫ్లుయెన్స్‌ చేసి సినిమాకు బిజినెస్ ఎక్కువ జరగాలని ఉద్దేశంతో ఇలా చేసి ఉండవచ్చు.ఇక ఈ మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సినిమా కథకు, టైటిల్‌కి ఏమాత్రం సంబంధం ఉండదు.ప్రధాన కథానాయకుడు రావు రమేష్ కేరక్టరైజేషన్‌, ప్రజెంటేషన్‌ అస్సలు బాగోవు.మూవీ కూడా ఎటెటో వెళ్లిపోతుంటుంది.ఓటీటీలో వస్తే పర్లేదు కానీ థియేటర్లో వస్తేనే ఈ మూవీ నిర్మాతలు నష్టపోయే ప్రమాదం ఎక్కువ.సుకుమార్( Sukumar ) భార్య తీసిందని, అల్లు అర్జున్( Allu Arjun ) ప్రమోట్ చేశాడని ప్రేక్షకులు ఈ సినిమాని వచ్చి చూస్తారనుకుంటే దానికంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు.

ఇందులో రావు రమేష్ కొడుకు, అతనికో లవ్ స్టోరీ ఉంటుంది.దీనివల్ల కథ అనేది ట్రాక్ తప్పుతుంది.

Telugu Allu Arjun, Annapoornamma, Indraja, Maruthinagar, Rao Ramesh, Sukumar, To

లాజిక్‌లెస్ సీన్లు కూడా ఎక్కువే.ఈ రోజుల్లో ప్రేక్షకులు కొంచెం లాజిక్ మిస్ అయినా వెంటనే పెదవి విరుస్తున్నారు.అలాంటిది ఇందులో చాలా పెద్ద లాజిక్‌లెస్ సీన్లు ఉన్నాయి.ఇక ఇందులో ఇంద్రజ మాస్ డాన్స్ వేసి చిరాకు పుట్టిస్తుంది.రమ్య అని మరొక నటిని తీసుకొచ్చి కామెడీ చేద్దామని ప్రయత్నించారు అది వర్కౌట్ కాలేదు.రావు రమేష్ ఎమోషన్స్ పలికించడంలో దిట్ట.

ఇందులో ఒక్క ఎమోషన్స్ సీన్ కూడా దర్శకుడు రాసుకోలేదు.చెప్పాలంటే ఇది ఒక ఫ్లాప్ సినిమా.

అల్లు అర్జున్, సుకుమార్‌ వచ్చి ఎంత డప్పు కొట్టినా సినిమాకి వరిగేది ఏమీ లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube