తెలుగు సినిమా ఇండస్ట్రీ బాలీవుడ్ ఇండస్ట్రీ( Bollywood industry)ని దాటేసి ముందుకు వెళ్తున్న విషయం మనకు తెలిసిందే.ఒకప్పుడు బాలీవుడ్ వాళ్ళు మనల్ని విపరీతంగా డామినేట్ చేసేవారు.
కానీ ఇప్పుడు తెలుగు సినిమా సత్తా ఏంటి అనేది వాళ్లకు తెలిసి వస్తుంది.ఇక మన హీరోలు వరుస సినిమాలను చేస్తూ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులను సైతం మన వైపు తిప్పుకుంటున్నారు.
ఇక అందులో భాగంగానే మన హీరోల సినిమాలు అన్ని కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటున్నాయి.
దీనివల్ల అక్కడి జనాలకి మన సినిమాల మీద మంచి ఇంప్రెషన్ అయితే ఏర్పడుతుంది.ఏది ఏమైనప్పటికి మన హీరోలు బాలీవుడ్ ఇండస్ట్రీని కోలుకోవాలని దెబ్బ కొట్టారు.మరి ఇలాంటి సందర్భంలో మన ఇండస్ట్రీ మీద మన హీరోల మీద బాలీవుడ్ నటులు విమర్శకులు పలు రకాల విమర్శలను కూడా చేస్తున్నారు.
ఇక ఏది ఏమైనప్పటికీ వాళ్ళు ఎలాగైనా సరే మనల్ని తక్కువ చేసి మాట్లాడాలని చూస్తున్నారు.కానీ మన వాళ్లు మాత్రం వాటిని పట్టించుకోకుండా సినిమాలతోనే సమాధానం చెబుతూ వాళ్లకి సరిపడ గుణపాఠం చెబుతున్నారు అంటూ సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.
ఇక ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్( Prabhas, Allu Arjun, Ram Charan, NTR) లాంటి నటులు పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను అందుకున్నారు.ఇక పవన్ కళ్యాణ్, మహేష్ బాబులు కూడా తొందర్లోనే వాళ్ళ సినిమాలతో భారీ సక్సెస్ ను కొట్టడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది.చూడాలి మరి ఇక మీదట కూడా మనవాళ్లు బాలీవుడ్ ఇండస్ట్రీని ఎలా దెబ్బతీస్తారు అనేది… అక్కడున్న మేకర్స్ కి సినిమాలు తీయడం రాదు గాని, మన హీరోల మీద కామెంట్లు మాత్రం చేస్తూ ఉంటారు… ఇక ఇది ఏమైనప్పటికి తెలుగు సినిమా ఇండస్ట్రీ నే ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ గా కొనసాగుతుంది…
.