గత కొన్ని దశాబ్దాలుగా చాలామంది భారతీయులు స్వీడన్‌కు( Sweden ) వెళ్లి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడుతున్నారు.కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారింది.
చాలామంది భారతీయులు( Indians ) స్వీడన్ నుంచి తిరిగి భారతదేశానికి వెళ్తున్నారు.అంటే, స్వీడన్‌కు వెళ్లేవారి కంటే, స్వీడన్ నుంచి వచ్చేవారే ఎక్కువ అన్నమాట.
ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం.గత ఇరవై సంవత్సరాలలో మొదటిసారిగా, భారీ సంఖ్యలో భారతీయులు స్వీడన్‌ను వదిలి వెళ్తున్నారని ‘స్టాటిస్టిక్స్ స్వీడన్’( Statistics Sweden ) పాపులేషన్ డేటా తెలిపింది.
ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే, గత సంవత్సరం కంటే 171% ఎక్కువ మంది భారతీయులు స్వీడన్ ను వదిలి వెళ్లారు.అంటే, ఈ ఏడాది 2837 మంది భారతీయులు స్వీడన్ నుంచి వెళ్లిపోయారు.
ఇంత పెద్ద సంఖ్యలో ఒకే దేశానికి చెందిన ప్రజలు స్వీడన్ నుంచి వెళ్లిపోవడం ఇదే మొదటిసారి.చైనా, ఇరాక్, సిరియా దేశాల వారు కూడా స్వీడన్ నుంచి వెళ్తున్నప్పటికీ, భారతీయుల సంఖ్యే అత్యధికం.

రీసెంట్‌గా అంకుర్ త్యాగి( Ankur Tyagi ) అనే ఒక ఎన్నారై ట్వీట్ చేస్తూ “స్వీడన్ చాలా అందంగా ఉంటుంది.అక్కడ కొత్త సంస్కృతిని అనుభవించవచ్చు.స్వీడన్‌లో ఉన్నా చాలా మంది భారతీయులు తమ మనసులో భారతదేశం గురించే ఆలోచిస్తున్నారు.” అని అన్నారు.ఆ దేశం నుంచి చాలామంది భారతీయులు ఎందుకు తిరిగి భారతదేశానికి వెళ్తున్నారో కూడా ఆయన వివరించారు.అవేవో చూద్దాం.

• ఉద్యోగ అవకాశాలు: భారతదేశంలో ఇప్పుడు చాలా మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయి.వేతనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.అందుకే చాలామంది భారతదేశానికి వెళ్తున్నారు.
• ఒంటరితనం: స్వీడన్‌లో భారతీయ సంస్కృతి( Indian Culture ) లేకపోవడం వల్ల చాలామంది భారతీయులు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు.తమ స్వదేశాన్ని, తమ కుటుంబాన్ని చాలా మిస్ అవుతున్నారు.
• భాష, సంస్కృతి: స్వీడిష్ భాష రాకపోవడం, స్వీడన్ సంస్కృతి అర్థం కాకపోవడం వల్ల చాలామందికి ఇబ్బంది అవుతుంది.
• ఉద్యోగం, జీవన వ్యయం: స్వీడన్‌లో ఉద్యోగం సంపాదించడం కష్టం.అక్కడ జీవన వ్యయం కూడా చాలా ఎక్కువ.