అమెరికా అధ్యక్ష ఎన్నికలు( US presidential election ) హోరాహోరీగా జరుగుతున్నాయి.డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధిగా ఎన్నికైన భారత సంతతి నేత, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్( Kamala Harris ) రేసులో దూసుకెళ్తున్నారు.
రన్నింగ్‌మెట్ (ఉపాధ్యక్ష అభ్యర్ధి)గా మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్‌ను ఎంపిక చేసుకున్న ఆమె ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు.ఓపీనియన్ పోల్స్, ముందస్తు సర్వేల్లో కమలా హారిస్ ముందంజలో ఉన్నారు.
త్వరలోనే రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆమె చర్చలో పాల్గొననున్నారు.
రేసులో తన స్పీడు తగ్గడంతో ట్రంప్ అప్రమత్తమయ్యారు.ప్రచారంతో పాటు ఛానెల్స్‌కు వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.కమలా హారిస్ బృందాన్ని టార్గెట్ చేస్తూ ఆయన టీమ్ విమర్శలు కురిపిస్తోంది.
తన మాటల దాడికి మరింత బలాన్ని తీసుకొచ్చేలా మాజీ డెమొక్రాట్ కాంగ్రెస్ నేత తులసి గబ్బార్డ్ను ట్రంప్ బరిలో దించినట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.ట్రంప్ ప్రైవేట్ క్లబ్, నివాసంగా ఉన్న ఫ్లోరిడాలోని మార్ ఏ లాగోలో జరిగిన ప్రాక్టీస్ సెషన్లో తులసి చేరినట్లుగా వార్తలు వస్తున్నాయి.సెప్టెంబర్ 10న జరిగే ఏబీసీ న్యూస్ ఛానెల్ డిబేట్లో ట్రంప్ – కమలా హారిస్ తలపడనున్నారు.2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ నామినేషన్ కోసం కమలా హారిస్ , తులసి గబ్బార్డ్‌లు హోరాహోరీగా తలపడ్డారు.చివరికి డిసెంబర్ 2019లో కమలా హారిస్, 2020 మార్చిలో తులసి గబ్బార్డ్( Tulsi Gabbard )లు రేసు నుంచి తప్పుకున్నారు.
2020 అధ్యక్ష ఎన్నికల సమయంలో డెమొక్రాటిక్ పార్టీ నుంచి వైదొలిగిన తులసి గబ్బర్డ్ .ట్రంప్ శిబిరంలో చేరారు.డొనాల్డ్ ట్రంప్‌తో చాలా ఏళ్లుగా స్నేహంగా ఉంటోన్న ఆమె ఒకానొక దశలో ట్రంప్ రన్నింగ్‌మెట్ అవుతారని అమెరికన్ మీడియాలో కథనాలు వచ్చాయి.
తాజాగా ట్రంప్ ప్రచార ప్రతినిధి కరోలిన్ లీవిట్ .ఒక ఈ మెయిల్లో గబ్బర్డ్ రాకను ధృవీకరించినట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.విధాన సలహాదారులు, తులసి గబ్బార్డ్ వంటి ప్రభావంతమైన వ్యక్తులతో ట్రంప్ సమావేశాలను కొనసాగిస్తారని లీవిట్ వెల్లడించారు.2016, 2020 నాటి అధ్యక్ష ఎన్నికలను మించి ఈసారి డిబేట్ల కోసం ట్రంప్ ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.