తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులు చాలా మంది ఉన్నారు… ఇక కల్కి సినిమాతో( Kalki ) తనకంటూ ప్రత్యేకథను ఏర్పాటు చేసుకున్న దర్శకుడు నాగశ్విన్( Nag Ashwin ) ప్రస్తుతం ఆయన కల్కి 2 సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే చిన్న దర్శకులతో వైజయంతి మూవీస్ బ్యానర్ లో సినిమాలను చేయించే బాధ్యతను కూడా తనే తీసుకున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇంతకుముందు వీళ్ళ బ్యానర్ లో ‘జాతి రత్నాలు’ అనే సినిమా వచ్చి సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది.
ఇక ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు మరి కొంతమంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే ఉద్దేశ్యం లో నాగశ్విన్ ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక అందులో భాగంగానే శ్రీకాంత్ కొడుకు అయిన రోశన్ ను( Roshan ) హీరోగా పెట్టి ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతో నాగశ్విన్ ప్రయత్నం చేస్తున్నాడు.ఇక అందులో భాగంగానే ఈ సినిమాని ఈరోజు అనౌన్స్ చేశారు.
అలాగే పూజ కార్యక్రమాలను కూడా జరిపినట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో చిన్న సినిమాగా వచ్చి ఒక భారీ సక్సెస్ ని సాధించాలని నాగశ్విన్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.చూడాలి మరి ఈ సినిమా కూడా జాతి రత్నాలు( Jathi Ratnalu ) రేంజ్ లోనే సూపర్ సక్సెస్ అవుతుందా లేదా అనేది…
ఇక మొత్తానికైతే నాగశ్విన్ చేస్తున్న ఈ పనికి చాలామంది సినీ విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అయితే దక్కుతున్నాయి.ఎందుకంటే చాలా మంది కొత్త దర్శకులు చిన్న అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే నాగశ్విన్ చేస్తున్న ఈ పని చిన్న దర్శకులను చాలా వరకు ఎంకరేజ్ చేసే విధంగా ఉందని పలువురు సినీ మేధావులు కూడా వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు….