ఆ పదవుల విషయంలో పోటా పోటీ .. బాబుని పవన్ ఒప్పిస్తారా ? 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పెద్ద బాధ్యతే వచ్చిపడింది.ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ( TDP, Janasena, BJP ) కూటమి అధికారం లో వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో పరిపాలనపైనే ప్రధానంగా అటు పవన్ , ఇటు చంద్రబాబు దృష్టిసరించారు.

 In The Case Of Those Positions, There Is A Contest.. Will Pawan Convince Cm Cha-TeluguStop.com

  ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు , ఏపీ అభివృద్ధి పైన ప్రధానంగా దృష్టి సారించారు.ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో,  నామినేటెడ్ పదవుల భర్తీ పైనా ఫోకస్ పెట్టారు.

అతి త్వరలోనే ఏపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసేందుకు ఇప్పటికే నిర్ణయించుకున్నారు.ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లోనూ గెలుపొందడం, రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేయగా అక్కడా విజయం సాధించడంతో , జనసేన ప్రాధాన్యం మరింతగా పెరిగింది.

Telugu Ap, Chandrababu, Cm Chandrababu, Janasena, Janasenani-Politics

ఎన్నికల సమయంలో టిడిపి,  జనసేన, బిజెపి మధ్య ఓట్ల బదిలీ అనుకున్న మేర జరగడం తో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది.ఏది ఏమైనా జనసేన సహకారంతోనే ఈ స్థాయిలో భారీ విజయం దక్కింది అనే విషయాన్ని అటు టీడీపీ, ఇటు బిజేపి లు గుర్తించాయి.దీంతో ఇప్పుడు నామినేటెడ్ పదవుల విషయంలో జనసేన( Janasena ) కు టీడీపీ ఏ స్థాయిలో ప్రాధాన్యం ఇస్తుంది అనే విషయంలో జన సైనికుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి.నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో జనసైనికులు టెన్షన్ పడుతున్నారు .ఈ పదవులపై జనసేన నాయకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.గత ఎన్నికల్లో టికెట్ దక్కని వారితో పాటు,  పార్టీ కోసం కష్టపడుతూ పనిచేసిన వారు తమకు కచ్చితంగా నామినేటెడ్ పదవి దక్కుతుందన్న ఆశతో ఉన్నారు.

Telugu Ap, Chandrababu, Cm Chandrababu, Janasena, Janasenani-Politics

కానీ నామినేటెడ్ పోస్టుల భర్తీలో టిడిపికి 65% , జనసేన కు 25% , బిజెపికి 10% ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఈ విషయం బయటకు రావడంతో జనసేన నాయకుల్లో ఆందోళన కలుగుతుంది .టిడిపిలో ఆశావాహులు ఎక్కువగా ఉండడం , ఆ పార్టీ ప్రభుత్వంలో కీలకంగా ఉండడం తో నామినేటెడ్ పదవుల విషయంలో తమకు అన్యాయం జరుగుతుందనే సందేహాలు జనసేన నాయకుల్లో ఉన్నాయి .ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చంద్రబాబుతో చర్చించి నామినేటెడ్ పోస్టులలో జనసేనకు సమ ప్రాధాన్యం దక్కేలా చూడాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube